Good Luck Gold Ring: ఈ రాశి వారు గోల్డ్ రింగ్ ధరిస్తే దరిద్ర దేవతకు బై బై చెప్పేసినట్లే.. పట్టిందల్లా బంగారమే..!

Gold Ring Get Good Luck: ఉంగరం సెంటిమెంట్ చాలా మందికి ఉంటుంది. ఏ వేలికి ఉంగరం ధరించాలి..? అందులో ఏ రాయి ఉండాలి..? ఎంత బరువు ఉండాలి..? అని ఇలా అన్ని లెక్కలు వేసుకుని ఉంగరాలు పెట్టుకుంటారు. తమ రాశి ఆధారంగా ఏం ఉంగరం ఉండాలని నిపుణుల సలహాలు కూడా తీసుకుంటారు. కొంతమంది రాశుల వారికి బంగారం ఉంగరం ధరిస్తే అదృష్ట దేవత వరిస్తుందని నమ్మకం.
 

1 /6

బంగారాన్ని ధరిస్తే.. చాలా లాభదాయకమని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతారు. అయితే ఏ రాశి వారు ఎలాంటి ఉంగరాలు ధరించాలనేది జ్యోతిష్య శాస్త్రంలో స్పష్టంగా పేర్కొన్నారు. అదేవిధంగా కొన్ని రాశులు బంగారు ఉంగరాన్ని ధరిస్తే అదృష్టం వరిస్తుంది.   

2 /6

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. సింహరాశి అగ్ని మూలకానికి సంకేతం అని అంటారు. ఈ రాశికి అధిపతి సూర్యుడు కాబట్టి వీరు బంగారు ఉంగరాన్ని ధరిస్తే.. అదృష్ట ఫలాలు లభిస్తాయని నిపుణులు చెబుతున్నారు.    

3 /6

కన్య రాశి వారు బంగారం ఉంగరం, నగలు ధరిస్తే.. వారి జీవితంలో అంతా మంచే జరుగుతుందని నమ్మకం. బంగారం కన్య రాశి వారికి కలిసి వస్తుందని అంటున్నారు.  

4 /6

తులారాశి వారికి బంగారం ధరిస్తే.. అదృష్టం వారి వెంటే ఉంటుందని చెబుతారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు ఉన్నాడు కాబట్టి వీళ్లు మీ జీవితంలో విజయం సాధించాలంటే.. తప్పకుండా బంగారు ఉంగరాన్ని ధరించాలి.    

5 /6

ధనుస్సు రాశి వారికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బంగారం ధరించడం చాలా శుభప్రదం. వీరికి జీవితంలోని అడ్డంకులను తొలగిపోతాయి.    

6 /6

గమనిక : ఇక్కడ అందజేసిన సమాచారం మత విశ్వాసం ఆధారంగా రాసినది. ZEE TELUGU NEWS దానిని నిర్ధారించలేదు.