Hansika: పెళ్లి తర్వాత కూడా తగ్గని హన్సిక దూకుడు.. గ్లామర్ విషయంలో హద్దులు చెరిపేస్తోన్న కంత్రి భామ..

Hansika: హన్సిక మోత్వానీ..చిత్ర పరిశ్రమలో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసి టాప్ కథానాయికగా సత్తా చాటింది. తెలుగులో  పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన ‘దేశ ముదురు’ చిత్రంతో కథానాయికగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత తమిళంలో ప్రవేశించి అక్కడి ఆడియన్స్  చేత గుడి  కట్టించుకునే  రేంజ్ కు ఎదిగింది. మ్యారేజ్  తర్వాత కూడా వరుస చిత్రాలతో పాటు హాట్ ఫోటో షూట్స్ తో  అదరగొడుతోంది.

1 /5

హన్సిక.. తెలుగు ఆడియన్స్  ఈమెను బొద్దు గుమ్మగా గుర్తు పెట్టుకున్నారు. అంతేకాదు ఆ గ్లామర్ తోనే తమిళ తంబీల ఆరాధ్య కథానాయికగా మారింది. ఏకంగా వాళ్ల చేత  గుడి కట్టించుకునే రేంజ్ ఎదిగింది.

2 /5

తెలుగులో అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోకు జోడిగా నటించిన హన్సిక.. ఆ తర్వాత తారక్ తో ‘కంత్రి’ మూవీతో చేసింది. ఎన్టీఆర్, బన్ని తర్వాత మరె బడా స్టార్ హీరోలెవరు ఈమెకు ఛాన్సులు ఇవ్వలేదు. కానీ కోలీవుడ్ ఇండస్ట్రీ మాత్రం హన్సికను   నెత్తిన పెట్టుకుంది.

3 /5

ప్రస్తుతం హన్సిన ఆచితూచి ఆచితూచి సినిమాలు చేస్తోంది. అప్పట్లో హన్సిక తన పెళ్లి కోసం ఏకంగా రూ. 20 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు ఇండస్ట్రీ వర్గాలు కోడై కూసాయి. 2007లో హీరోయిన్ గా పరిచయమై ఇప్పటికీ హీరోయిన్ గా లైమలైట్ లో ఉండటం మాములు విషయం కాదు.

4 /5

హన్సిక చేతిలో సినిమాలున్నా.. లేకపోయినా.. ఎప్పుడు తన హాట్ ఫోటో షూట్ లతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూ హల్ చల్ చేయడం హన్సిక మార్క్ స్టైల్ అని చెప్పాలి. మ్యారేజ్ మల్లె తీగలా సన్నబడి నాజుగ్గా తయారైంది. దానికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో  వైరల్ అవుతున్నాయి. 

5 /5

హన్సిక 9 ఆగష్టు 1991 ముంబైలో జన్మించింది. ముందుగా చైల్డ్ యాక్ట్రెస్ పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత టాప్ హీరోయిన్ గా సత్తా చూపెడుతుంది.