Hansika New House: కొత్త ఇల్లు కొన్న అల్లు అర్జున్‌ హీరోయిన్‌.. ఈ 'దేశముదురు' కొన్న ఇంటి ధర వింటే షాక్‌

Hansika Motwani New Beginnings With Buys New Home: తెలుగు సినీప్రియులను అందంతో ఆకట్టుకున్న దేశముదురు అమ్మాయి హన్సిక మోత్వానీ కొత్తగా ఇల్లు కొనుగోలు చేశారు. గృహ ప్రవేశ వేడుక బంధుమిత్రుల మధ్య జరగ్గా దానికి సంబంధించిన ఫొటోలను పంచుకుంది. ఆ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

1 /6

తెలుగు సినీ ప్రేక్షకులకు హన్సిక మోత్వానీ సుపరిచితం. అల్లు అర్జున్‌తో కలిసి దేశముదురుతో సినీ అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే.

2 /6

ఇటీవల కొత్త ఇంటిని కొనుగోలు చేసిన హన్సిక తాజాగా గృహ ప్రవేశ వేడుక నిర్వహించింది. గృహ ప్రవేశం తన భర్త సోహైల్‌ ఖతూరియాతో కలిసి శాస్త్రోక్తంగా పూజలు చేశారు. ఈ సందర్భంగా హోమం నిర్వహించారు.

3 /6

ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను హన్సిక తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. 'న్యూ బిగినింగ్స్‌' అంటూ ఫొటోలను షేర్‌ చేసింది.

4 /6

తలపై కలశం పెట్టుకుని ఇంట్లోకి అడుగుపెడుతున్న ఫొటో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఈ వేడుక సందర్భంగా ఆకుపచ్చ చీరలో హన్సిక మెరిసింది. కొన్ని స్టిల్స్‌ ఇచ్చి సంబర పడింది.

5 /6

తెలుగులో దేశముదురు, కంత్రి, కందిరీగ, దేనికైనా రెడీ తదితర సినిమాలు చేసి తమిళ్‌, హిందీ సినిమాల్లో నటించిన హన్సిక సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం ఓ టీవీ ఛానల్‌ నిర్వహిస్తున్న డ్యాన్స్‌ షోలో జడ్జిగా వ్యవహరిస్తున్నారు.

6 /6

వ్యాపారవేత్త సోహైల్‌ ఖతూరియాను 4 డిసెంబర్‌ 2022న హన్సిక వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరూ ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు.