Happy Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతి శుభాకాంక్షలు, కోట్స్, HD ఫొటోస్..

Happy Hanuman Jayanti 2024 Wishes And HD photos: హిందూ సాంప్రదాయం ప్రకారం..హనుమాన్ జన్మించిన రోజునే హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ఏప్రిల్ 23వ తేదీన వచ్చింది. ఈ శుభ సందర్భంగా మీ తోటి స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఇలా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేయండి.


Happy Hanuman Jayanti 2024 Wishes And HD Photos: తల్లి అంజనీ దేవికి చైత్రమాసంలోని శుక్లపక్షమి పౌర్ణమి రోజున మహావీరుడు హనుమంతుడు జన్మించడం కారణంగానే హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. అందుకే ఈ హనుమాన్ జయంతికి హిందూ సాంప్రదాయంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి ఏప్రిల్ 23వ తేదీన వచ్చింది. ఈరోజు హనుమాన్ భక్తులంతా భక్తిశ్రద్ధలతో స్వామిని పూజించి ప్రత్యేకమైన ఉపవాసాలు పాటిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రోజున ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ.. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేయండి.
 

1 /10

ఈ పవిత్రమైన రోజు శుభ సందర్భంగా హనుమంతుడి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండాలని మీ జీవితంలో ఆనందం అదృష్టం రెట్టింపు అవ్వాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.  

2 /10

ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయుడు అనుగ్రహం లభించి మీరు ప్రత్యేకమైన శక్తిని పొందాలని కోరుకుంటూ.. మీ అందరికీ హనుమాన్ జయంతి ప్రత్యేకమైన శుభాకాంక్షలు.  

3 /10

మీ జీవితంలో హనుమంతునిలా మీరు కూడా అజయ్యులుగా, శక్తివంతులుగా, ధైర్యవంతులుగా ఉండాలని ఆశిస్తూ ప్రతి ఒక్కరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.  

4 /10

మీ జీవితంలో వస్తున్న అడ్డంకులన్నీ తొలగిపోయి..విజయాలు సాధించడానికి, శ్రీ హనుమంతుని మార్గదర్శకత్వం, అనుగ్రహం లభించాలని ఆకాంక్షిస్తూ.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.

5 /10

హనుమంతునిలా మీరు కూడా నిస్వార్థ సేవ, భక్తి, అంకితభావంతో నిండి ఉండాలని ఆశిస్తూ.. మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు..  

6 /10

ఎంతో పవిత్రమైన ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయుడు అనుగ్రహంతో మీ జీవితం మొత్తం ఆరోగ్యం సంతోషం శ్రేయస్సుతో నిండి ఉండాలని మనసారా కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హనుమాన్ జయంతి ప్రత్యేకమైన శుభాకాంక్షలు.  

7 /10

జీవితంలో వస్తున్న సవాళ్లను హనుమంతుడిలా ధైర్యం తెలివితేటలతో సులభంగా ఎదుర్కోవాలని కోరుకుంటూ.. మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.  

8 /10

హనుమంతుడి వలె దృఢనిచ్చయంతో మీ జీవితంలో లక్ష్యాలను సులభంగా సాధించాలని కోరుకుంటూ.. మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు..  

9 /10

హనుమంతుడి అనుగ్రహంతో మీరు మీ కుటుంబ సభ్యులు ఎల్లప్పుడూ ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హనుమాన్ జయంతి ప్రత్యేక శుభాకాంక్షలు..

10 /10

హనుమాన్ జయంతి శుభ సందర్భంగా ఆంజనేయులు అనుగ్రహం పొంది. ఎల్లప్పుడూ మీ జీవితంలో విజయాలు సాధించాలని మనసారా కోరుకుంటూ, మీ అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు..