Happy Hanuman Jayanti 2024 Wishes: హనుమాన్ జయంతి కోట్స్, స్పెషల్ విషెస్, HD ఫొటోస్..

Happy Hanuman Jayanti 2024 Images And Wishes In Telugu: హనుమాన్ జయంతి ఈ సంవత్సరం హనుమంతుడికి ఎంతో ఇష్టమైన మంగళవారం రోజున వచ్చింది కాబట్టి ఈరోజుకి మరింత ప్రాముఖ్యత పెరిగింది. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన రోజున ఆంజనేయుడు అనుగ్రహం మీ మేలుకోరే వారికి లభించాలని ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి.

 

Happy Hanuman Jayanti 2024 Images And Wishes In Telugu: ఈ సంవత్సరం హిందువులు అత్యంత ఘనంగా జరుపుకొని హనుమాన్ జయంతి ఆంజనేయుడికి ఎంతో ప్రీతికరమైన రోజు మంగళవారం వచ్చింది. చైత్రమాసంలోని శుక్లపక్షం పౌర్ణమి రోజున అంజనీ దేవికి హనుమంతుడు జన్మించారని భక్తుల నమ్మకం. అందుకే ప్రతి సంవత్సరం ఇదే రోజున హనుమాన్ జయంతిని జరుపుకుంటారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రం ఇతర రాష్ట్రాల్లో ఈ పండగను పెద్ద ఎత్తున జరుపుకుంటారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనైతే హనుమాన్ జయంతి సందర్భంగా దాదాపు అన్ని చోట్ల రథయాత్రలు నిర్వహిస్తారు. అలాగే భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు హనుమంతుడిని పూజించి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు. ఇలాంటి శుభ సందర్భంగా హనుమంతుడి అనుగ్రహం మీ మేలు కోరే ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ.. వారందరికీ ఇలా శుభాకాంక్షలు తెలియజేయండి.

1 /8

బలం, శక్తి, ధైర్యానికి చిహ్నమైన హనుమంతుడి జీవితం మనకు స్ఫూర్తినివ్వాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.  

2 /8

హనుమంతుడి అనుగ్రహంతో మన జీవితాల్లోని కష్టాలన్నీ తొలగిపోయి. ఎల్లప్పుడు సుఖసంతోషాల నడుమ జీవించాలని ప్రార్థిస్తాం.. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.  

3 /8

ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఆంజనేయుడు జీవితం మనకు నేర్పించిన విలువలను స్వీకరించి ఆయన బాటలో కొనసాగాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.

4 /8

దేశవ్యాప్తంగా ఉన్న హనుమాన్ భక్తులకు, హిందూ మిత్రులకు పేరుపేరునా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.  

5 /8

ఆంజనేయుడు ఎప్పుడు సత్యం బాటలోనే ప్రయాణించాడు.. మనమందరం కూడా ఆయన మార్గంలోనే నడుచుకుంటూ రామరాజ్యానికి అడుగులు వేద్దాం.. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.

6 /8

శక్తి ధైర్యాన్ని ఇచ్చే హనుమాన్ భక్తి ఎల్లప్పుడూ మనతోనే ఉండాలని, ఆ ఆంజనేయుడు అనుగ్రహం కలకాలం మనపై ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.

7 /8

హనుమంతుని జయంతి సందర్భంగా.. ఆంజనేయుడు అనుగ్రహం కలిగి మనలో అహంకారం తొలగిపోయి, వినయం ప్రకాశించాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.

8 /8

హనుమంతుడి అనుగ్రహంతో ప్రతిరోజు మీరు మీ కుటుంబ సభ్యులు అంతా ఆరోగ్యంగా సుఖసంతోషాలతో జీవించాలని మనసారా కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.