HDFC Bank: హెచ్‌డీఎఫ్‌సీ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. రేపు ఆ మూడు గంటలు యూపీఐ సర్వీసు నిలిపివేత..

HDFC Bank account holders: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అధికారులు తమ కస్టమర్లకు కీలక అలర్ట్ ను జారీ చేశారు. ఆగస్టు 10 వ తేదీన కొన్నిగంటల పాటు యూపీఐ సేవలు పనిచేయవని పేర్కొన్నారు. అసౌకర్యానికి గల కారణాలను కూడా బ్యాంక్ అధికారులు పేర్కొన్నారు.
 

1 /5

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అధికారులకు ఎప్పటికప్పుడు తమ ఖాతాదారులకు మెరుగైన సౌకర్యలు అందించడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో మారుతున్న బ్యాంకింగ్ కార్యకలాపాల నేపథ్యంలో తమ సాఫ్ట్ వేర్ లో కూడా పలు మార్పులు తీసుకొస్తున్నారు.   

2 /5

దీనిలో భాగంగానే రేపుఅంటే.. ఆగస్టు 10 న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యూపీఐ సేవలు మూడు గంటల పాటు పనిచేయవని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అధికారులు స్పష్టం చేశారు. తమ కస్టమర్లకు ముందస్తుగా అధికారులు ఈ విధంగా వివరణ కూడా ఇచ్చుకున్నారు. 

3 /5

తమ కస్టమర్లే తమకు ముఖ్యమని, వారికి సేవలందించే దిశగా బ్యాంక్ సాఫ్ట్ వేర్ లో పలుమార్పులు తీసుకొస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దీనిలో భాగంగా ఆగస్టు 10 న ఉదయం 2:30 నుంచి 5:30 వరకు UPI సేవలు నిలిపేస్తున్నారు. బ్యాంక్ ఎమర్జెన్సీలో పలుమార్పుల కారణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.దీనిలో భాగంగానే రేపుఅంటే.. ఆగస్టు 10 న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యూపీఐ సేవలు మూడు గంటల పాటు పనిచేయవని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అధికారులు స్పష్టం చేశారు. తమ కస్టమర్లకు ముందస్తుగా అధికారులు ఈ విధంగా వివరణ కూడా ఇచ్చుకున్నారు. 

4 /5

ఈసమయాన్ని కస్టమర్లు గమనించి తమ లావాదేవీలు చూసుకొవాలని హెచ్‌డీఎఫ్‌సీ అధికారులు సూచించారు. ఈ సమయంలో ముఖ్యంగా గూగుల్ పే, ఫోన్ పే, వాట్సప్ వంటి థర్డ్ పార్టీ యాప్ లలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యూపీఐ సేవలు పనిచేయవని బ్యాంక్ అధికారులు స్పష్టంచేశారు.  

5 /5

కేవలం ఆగస్టు 10న సిస్టమ్ మెయింటెనెన్స్ కారణంగా మూడు గంటల పాటు వినియోగదారులకు UPI సేవలు అందుబాటులో ఉండవని అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు హెచ్‌డీఎఫ్‌సీ  బ్యాంక్ ప్రకటన విడుదల చేసింది.