Amla Benefits: సమ్మర్ లో ఉసిరి తినడం వల్ల కలిగే ఈ ప్రయోజనాలు మీకు తెలుసా..?

Amla Benefits: ఉసిరి లో మన శరీరానికి మేలు చేసే అనేక గుణాలుంటాయని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా సమ్మర్ లో ఉసిరి ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని చెబుతుంటారు. 
 

1 /5

ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల ఎండలు 47 డిగ్రీలను క్రాస్ చేసేశాయి. జనాలు బైటకు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. తప్పనిసరైతేనే బైటకు వెళ్లాలని ఇప్పటికే నిపుణులు సూచనలు కూడా జారీచేశారు. ఫ్రూట్ జ్యూస్ లు, ఎండనుంచి ఉపశమనం కల్గించే వాటిని ఎక్కువగా తీసుకొవాలని నిపుణులు సూచిస్తున్నారు.  

2 /5

ఉసిరిలో విటమిన్ లు, పోషకపదార్థాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు మనం తినే ఫుడ్ లో ఉసిరి తప్పకుండా ఉండేలా ప్లాన్ లుచేసుకొవాలి. అంతేకాకుండా.. ఉసిరి రసం, ఉసిరి ఆవకాయ తిన్న కూడా అనేక జీర్ణక్రియ సమస్యలు దూరమైపోతాయి.

3 /5

ముఖ్యంగా కొందరు ఎండల వల్ల శరీరంలో నుంచి నీటిని డీహైడ్రేషన్ వల్ల నీళ్లలో కోల్పోతుంటారు. దీంతో ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతుంటారు. ఇలాంటి వారి శరీరంలో ఉసిరి ప్రభావ వంతంగా పనిచేస్తుంది. దగ్గు సమస్యలను దూరం చేస్తుంది.  

4 /5

జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారికి ఉసిరి రసం, ఉసిరి కాయలు ఎంతగానో ఉపయోగపడుతాయి. అందుకే ఉసిరిని తప్పనిసరిగా మనం తినే డైట్ లో ఉండేలా ప్లాన్ చేసుకొవాలని నిపుణులు చెబుతున్నారు.

5 /5

ఉసిరి రక్తంలోని చెడు కణాలను శుభ్రం చేస్తుంది. మూత్రనాళ సమస్యలతో బాధపడున్న వారిలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. శరీరంపై అలెర్జీలు, బరువు తగ్గాలనుకునే వారిలో ఉసిరి ప్రభావ వంతంగా పనిచేస్తుంది. అందుకే ఉసిరిసి సమ్మర్ లో తినాలని నిపుణులు చెబుతున్నారు.(Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)