Gum Bleeding: కొన్ని సందర్భాల్లో పళ్లు క్లీన్ చేసే సమయంలో చిగుళ్ల నుంచి రక్తం కారుతుంటుంది. సాధారణంగా మనం ఈ సమస్యను నిర్లక్ష్యం చేస్తుంటాం. ఈ సమస్యను సకాలంలో పరిష్కరించకపోతే మరింత పెరిగిపోవచ్చు.
Gum Bleeding: అయితే దంత సమస్య ముఖ్యంగా చిగుళ్ల నుంచి రక్తం కారుతున్నప్పుడు ఆందోళన చెందాల్సి న అవసరం లేదు. కొన్ని చిట్కాలతో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచుతుంది. విటమిన్ సి ఎక్కువగా తీసుకంటే చిగుళ్ల నుంచి రక్తం కారే సమస్య తొలగిపోతుంది.
సిగరెట్, బీడీ, హుక్కా తాగే అలవాటున్నవారిలో పంటి సమస్య అధికంగా ఉంటుంది. అంతేకాకుండా ఊపిరితిత్తులు, గుండెపై ప్రభావం పడుతుంది. చిగుళ్ల సమస్యను పెంచుతుంది. గమ్స్ బ్లీడింగ్ తగ్గాలంటే ఈ చెడు అలవాట్లు మానుకోవాలి.
పళ్ల క్లీనింగ్ కోసం కేవలం బ్రషింగ్ ఒక్కటే సరిపోదు. పూర్తిగా క్లీన్ చేసేందుకు హైడ్రోజన్ పెరాక్స్డైడ్‌తో పుక్కిలించడం మంచి పద్ధతి. దీనివల్ల చిగుళ్ల నుంచి రక్తం కారే సమస్య పోతుంది.
పళ్ల క్లీనింగ్ సరిగ్గా లేకపోతేనే చిగుళ్ల నుంచి రక్తం కారుతుంటుంది. రోజుకు రెండుసార్లు బ్రష్ చేస్తే పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఇవి కాకుండా డెంటల్ ఫ్లాస్ కూడా కారణం కావచ్చు. పళ్లు క్లీన్‌గా ఉంటే చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
చిగుళ్ల నుంచి రక్తం కారడానికి చాలా కారణాలుంటాయి. గట్టిగా బ్రష్ చేయడం, అంతర్గత సమస్య, దెబ్బ తగలడం వంటివి కావచ్చు.