Cholesterol tips: ఆధునిక జీవనశైలిలో చాలామంది కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. కొలెస్ట్రాల్ ఎంత సులభంగా నియంత్రించవచ్చో..అంత ప్రమాదకరమైంది. వివిధ రకాల వ్యాధులకు కొలెస్ట్రాల్ కారణం. రోజూ ఉదయం వేళ ఈ ఫ్రూట్స్‌ని బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చితే కొలెస్ట్రాల్ సమస్య నుంచి కేవలం నెలరోజుల్లోనే విముక్తి పొందవచ్చు.
స్ట్రాబెర్రీ కొలెస్ట్రాల్ సమస్య బాధిస్తుంటే..మీ బ్రేక్‌ఫాస్ట్‌లో స్ట్రాబెర్రీ ఫ్రూట్స్ చేర్చాలి. ఇది రోజూ తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఆరెంజ్ ఆరెంజ్ ఆరోగ్యానికి చాలా మంచిది. కొలెస్ట్రాల్ సమస్య తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే విటమిన్ సి ఇమ్యూనిటీని పెంచుతుంది. కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.
కివి చెడు కొలెస్ట్రాల్ మీకు సమస్యగా మారితే..కివీ ఫ్రూట్స్ రోజూ క్రమం తప్పకుండా తీసుకోవాలి. దీనివల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో రావడమే కాకుండా..బరువు కూడా తగ్గుతారు.
అరటి అరటి కొలెస్ట్రాల్ రోగులకు అద్భుత ప్రయోజనాల్ని అందిస్తుంది. రోజూ అరటి తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. బ్రేక్‌ఫాస్ట్ రూపంలో తీసుకుంటే అధిక ప్రయోజనాలు కలుగుతాయి.
యాపిల్ కొలెస్ట్రాల్ సమస్య అధికంగా ఉంటే..యాపిల్ మంచి ప్రత్యామ్నాయం. ఇందులో పెద్దమొత్తంలో ఉండే ఫైబర్ మీ శరీరంలో కొలెస్ట్రాల్ బయటకు తీయడంలో సహాయపడుతుంది.