Health tips: ఈ 5 చిట్కాలు పాటిస్తే కొలెస్ట్రాల్ సమూలంగా దూరం

Health tips: కొలెస్ట్రాల్ అనేది శరీరానికి చాలా ప్రమాదకరం. అదే గుడ్ కొలెస్ట్రాల్ అయితే అవసరం కూడా. శరరంలో గుడ్ కొలెస్ట్రాల్ అనేది కణజాలం, విటమిన్ డి, హార్మోన్ నిర్మాణంలో దోహదపడుతుంది. అదే చెడు కొలెస్ట్రాల్ ఉంటే మాత్రం తీవ్రమైన అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది. 

Health tips: చెడు కొలెస్ట్రాల్ అనేది ఆరోగ్యానికి హానికరం. చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనసైలి కారణంగా ఈ పరిస్థితి తలెత్తుతుంది. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే హార్ట్ ఎటాక్, స్ట్రోక్ ముప్పు పెరుగుతుంది. చెడు కొలెస్ట్రాల్ దూరం చేసేందుకు కొన్ని ఆయుర్వేద చిట్కాలున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం..

1 /5

పసుపు పసుపులో కర్‌క్యూమిన్ ఉంటుంది. ఇది అత్యంత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. చెడు కొలెస్ట్రాల్‌ను అత్యంత సమర్ధవంతంగా దూరం చేస్తుంది. రాత్రి నిద్రించేముందు గోరు వెచ్చని పాలలో కొద్దిగా పసుపు కలిపి తాగడం అలవాటు చేసుకోవాలి.

2 /5

తేనె తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ని నియంత్రించడంలో అద్భుతంగా దోహదం చేస్తాయి. ఒక కప్పు వేడి నీళ్లలో ఒక స్పూన్ తేనె, నిమ్మరసం , యాపిల్ వెనిగర్ కలిపి తాగాలి. దీనివల్ల కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.

3 /5

అల్లంలో జింజరాల్ అనే పోషకం చెడు కొలెస్ట్రాల్‌ను దూరం చేయడంలో అద్బుతంగా ఉపయోగపడుతుంది. అల్లంను పచ్చిగా కూడా తినవచ్చు.

4 /5

వెల్లుల్లి వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ చెడు కొలెస్ట్రాల్ ముప్పును తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. 6-8 వెల్లుల్లి రెమ్మల్ని గుజ్జు చేసి పాలలో కలిపి ఉడికించి తాగాలి. దీనివల్ల కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 

5 /5

మెంతులు మెంతుల్లో ఫైబర్, పొటాషియం, ఐరన్, జింక్ వంటి ఇతర పోషకాలున్నాయి. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు అద్బుతంగా ఉపయోగపడుతుంది. దీనికోసం ఒక స్పూన్ మెంతి పౌడర్‌ను గోరువెచ్చని నీళ్లలో కలిపి రోజుకు రెండుసార్లు తాగాలి. ఫలితంగా చెడు కొలెస్ట్రాల్ వేగంగా కరిగిపోతుంది.