Healthy Fruits: సీజనల్ వ్యాధులు రాకుండా ఉండాలంటే ఈ 5 రకాల పండ్లు డైట్‌లో చేర్చండి

Healthy Fruits: వేసవిలోనే కాదు ప్రతి సీజన్‌లోనూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తుండాలి. వివిధ రకాల వ్యాధుల సోకకుండా ఉండేందుకు సీజనల్ ఫ్రూట్స్ తప్పకుండా తీసుకోవాలి. ముఖ్యంగా వేసవిలో వాటర్ కంటెంట్ అధికంగా ఉండే పండ్లను తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవు.

Healthy Fruits: వేసవిలో సాధారణంగా డీ హైడ్రేషన్, అధిక రక్తపోటు లేదా లో బీపీ సమస్యలు తలెత్తుతాయి. వడదెబ్బ తగలడం మరో ప్రధాన సమస్యగా ఉంటుంది. అందుకే వేసవిలో డైట్ సరిగ్గా ఉండేట్టు చూసుకోవాలి. ముఖ్యంగా ఈ ఐదు రకాల పండ్లు తప్పకుండా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. 
 

1 /5

పైనాపిల్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. ఇమ్యూనిటీ తగ్గకుండా ఉంటుంది. దాంతోపాటు ఇందులో ఫైబర్ అదికంగా ఉండటం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవు. పైనాపిల్ అనేది కేలరీలు తక్కువగా ఉండే ఫ్రూట్ కావడంతో బరువు తగ్గేందుకు ఉపకరిస్తుంది.

2 /5

బొప్పాయి ప్రతి సీజన్‌లో విరివిగా లభించే ఫ్రూట్. బొప్పాయి రోజూ తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. కడుపు సంబంధిత సమస్యలు ఉండవు. 

3 /5

లిచి ఫ్రూట్స్ అనేవి శరీరంలో పెరుగుతున్న వేడిమిని నియంత్రిస్తాయి. ఇందులో ఉండే వివిధ రకాల పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడటంలో దోహదపడతాయి.

4 /5

కివీ పండ్లు డైట్‌లో తప్పకుండా చేర్చాలి. ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు , యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువ ఉంటాయి. ఇవి శరీరాన్ని తాజాగా, ఇమ్యూనిటీ పెంచేలా చేస్తాయి. వివిధ రకాల అనారోగ్య సమస్యలు దరిచేరకుండా కాపాడుతాయి.

5 /5

ద్రాక్షలో కార్బోహైడ్రేట్లు, సోడియం, విటమిన్లు, మినరల్స్ చాలా ఉంటాయి. ద్రాక్ష తినడం వల్ల శరీరంలో నీటి కొరత ఉండదు. శరీరానికి చలవచేస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండటంతో అజీర్తి సమస్యలు తొలగిపోతాయి.