Heart Attack Signs: ఇటీవలి కాలంలో గుండె వ్యాధుల ముప్పు చాలా అధికంగా కన్పిస్తోంది. వయస్సుతో సంబంధం లేకుండా మూడు పదుల వయస్సులో కూడా హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్, హార్ట్ స్ట్రోక్ వంటి ప్రాణాంతక సమస్యలు కన్పిస్తున్నాయి. అయితే హార్ట్ ఎటాక్ వచ్చే ముందు కొన్ని లక్షణాలు తప్పకుండా కన్పిస్తాయంటారు. ఆ లక్షణాలుంటే వెంటనే అప్రమత్తం కావడం ద్వారా గుండె వ్యాధుల ముప్పు నుంచి తప్పించుకోవచ్చు.
హార్ట్ బీట్‌లో మార్పు హార్ట్ ఎటాక్ లక్షణాలు వేర్వేరుగా ఉండవచ్చు. ప్రధానమైన సంకేతం హార్ట్ బీట్ మారడం. ఈ పరిస్థితి ఎదురైతే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
చెవి సంబంధిత సమస్యలు కొంతమందికి హార్ట్ ఎటాక్ వచ్చే ముందు చెవి సంబంధిత సమస్యలు కన్పిస్తాయి. ఈ లక్షణం కన్పించినప్పుడు నిర్లక్ష్యం వహించకూడదు
తల తిరుగుతుండటం కొంతమందికి తరచూ తల తిరుగుతుండటం లేదా మైకం కమ్మినట్టు ఉండటం ఉంటుంది. ఇది కచ్చితంగా హార్ట్ ఎటాక్ లక్షణం. ఏ మాత్రం అశ్రద్ధ వహించకుండా వైద్యుడిని సంప్రదించాల్సి ఉంటుంది.
శ్వాస సంబంధిత సమస్యలు హార్ట్ ఎటాక్ రోగుల్లో కన్పించే లక్షణాల్లో శ్వాస సంబంధ సమస్య ప్రధానమైంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తవచ్చు.
కాళ్లలో వాపు హార్ట్ ఎటాక్ వచ్చేముందు చాలా లక్షణాలు కన్పిస్తుంటాయి. అయితే చాలామంది ఈ లక్షణాల్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. కాళ్లలో వాపు రావడం కూడా హార్ట్ ఎటాక్ లక్షణాల్లో ఒకటి.