Dreams Effect on humans life: మనలో చాలా మంది పడుకొగానే నిద్రపోతుంటారు. నిద్రలో ఎక్కువగా వచ్చే కలలను బట్టివారి జీవితంలో కలిగే యోగాలను చెప్పొవచ్చని జ్యోతిష్యులు చెబుతుంటారు.
మనకు స్వప్నంలో కనుక ఇంట్లో నల్ల చీమలు కన్పిస్తే మంచి జరుగుతుందంట. నల్ల చీమలు యూనీటీకి, ఒకదానికి మరోకటి సహాయం చేసుకుంటాయి. దీని వల్ల మన జీవితంలో కూడా ఉన్నత స్థానానికి వెళ్తారని చెబుతుంటారు.
మరికొందరు తమ కలలో పక్షులు గూడుకట్టుకుని ఉండంను చూస్తారు. రెండు పక్షులు కష్టపడి తమ గూడును కోవడం చూస్తుంటారు. ఇలా కలలో కన్పించడం మంచిదని చెబుతుంటారు.
కొందరికి కలలో గుడ్లగూబలు కూడా కన్పిస్తాయి. గుడ్లగూబను ముఖ్యంగా లక్ష్మీదేవి వాహానంగా భావిస్తారు. కలలో గుడ్లగూబ మనకు స్వప్నంలో కన్పిస్తే ఆకస్మిక ధనలాభానికి సూచకంగా భావిస్తారు.
కలలో ఏనుగులు కన్పించిన లేదా ఏనుగుల వద్దకు మనం వెళ్లినట్లు కలలో కన్పించిన కూడా ఇప్పటిదాక జీవితంలో ఎదురైన అన్నిరకాల ఇబ్బందులు తొలగిపోయిన మంచి జరుగుతుందని చెబుతుంటారు.
నక్షత్రాలు కన్పించడంను కూడా మంచి శకునంగా భావిస్తారు. కలలో మనకు, ఎవరైన డబ్బులు ఇస్తున్నట్లు కన్పిచడం, నక్షత్రాలు కన్పించడం మంచిదని చెబుతుంటారు. జ్యోతిష్యుల ప్రకారం.. దీని వల్ల జీవితంలో మంచి యోగం కల్గుతుందని చెబుతుంటారు.(Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)