Zinc Foods Side Effects: జింక్ ఫుడ్స్‌తో జాగ్రత్త, ఈ 5 సమస్యలు వెంటాడుతాయి, రోజుకు ఎంత జింక్ అవసరం

Zinc Foods Side Effects: శరీర నిర్మాణం, ఎదుగుదలకు వివిధ రకాల విటమిన్లు, మినరల్స్ అవసరమౌతాయి. వీటిలో అతి ముఖ్యమైంది జింక్. శరీరానికి మంచిది కదా అనే ఉద్దేశ్యంతో అతిగా సేవిస్తే అనర్ధాలు కలుగుతాయి. అంటే పరిమితి దాటి జింక్ పదార్ధాలు తీసుకోకూడదు. బాదం, పిస్తా, వాల్‌నట్స్, పప్పులు, బీన్స్, ఫ్యాటీ ఫిష్ , గుడ్లు, ఆనపకాయ విత్తనాల్లో జింక్ పెద్దమొత్తంలో ఉంటుంది.

Zinc Foods Side Effects: ప్రముఖ న్యూట్రిషనిస్టుల సూచనల ప్రకారం రోజుకు 7.6 నుంచి 9.7 మిల్లీగ్రాముల జింక్ అవసరం ఉంటుంది. ఇది దాటితే వివిధ రకాల అనర్ధాలు కలుగుతాయి. చాలా రకాల సమస్యలు ఎదురౌతాయి. ఈ క్రమంలో గుడ్లు, నట్స్ వంటివి రోజుకు ఎంత తీసుకోవాలి..
 

1 /5

అజీర్తి పరిమితి మించి జింక్ తీసుకుంటే జీర్ణ సంబంధ సమస్యలు ఉత్పన్నమౌతాయి. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి ఉండవచ్చు. అందుకే జింక్ ఫుడ్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

2 /5

మెటాలిక్ టేస్ట్  జింక్ పరిమితికి మించి తినేవారికి ఆహారం మెటాలిక్ టేస్ట్‌లా అన్పిస్తుంది. దాంతో ఆహారం తినబుద్ధి కాదు. తిన్నట్టు ఉండదు. అందుకే మోతాదు మించి జింక్ ఉండకూడదు.

3 /5

అనారోగ్య సమస్యలు జింక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల ధైరాయిడ్, కంటి సమస్యలకు, శ్వాస సంబంధిత సమస్యలు ఉత్పన్నం కావచ్చు.

4 /5

రియాక్షన్ విత్ మెడిసిన్ జింక్ అధికంగా ఉండే పదార్ధాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మందులు ఇతర మినరల్స్‌తో కలిగి రియాక్షన్ రావచ్చు. ఇది ప్రమాదకరం

5 /5

విటమిన్స్ అండ్ మినరల్స్ శరీర నిర్మాణం ఎదుగుదలకు విటమిన్లు, మినరల్స్ అవసరం. అలాగని జింక్ అధికంగా ఉండే ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే బ్యాలెన్స్ చెడిపోతుంది. దాంతో పోషకాల లోపం తలెత్తుతుంది.