Holi 2024: దేశంలో హోలీ ఎక్కడెక్కడ ప్రసిద్ధి, ఏ పేరుతో జరుపుకుంటారు

మార్చ్ నెల వచ్చేసింది. దేశమంతా ఎదురుచూసే హోలీ వస్తోంది. ఫల్గుణ మాసంలో చాలా పండుగలున్నాయి.  హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది హోలీ మార్చ్ 25వ తేదీన ఉంది. హోలీ అనగానే సాధారణంగా దేశంలోని మధుర-బృందావన్ గుర్తొస్తాయి. కానీ ఇంకా చాలా ప్రాంతాల్లో హోలీ అత్యంత ఘనంగా జరుపుకుంటారు. 

Holi 2024: మార్చ్ నెల వచ్చేసింది. దేశమంతా ఎదురుచూసే హోలీ వస్తోంది. ఫల్గుణ మాసంలో చాలా పండుగలున్నాయి.  హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది హోలీ మార్చ్ 25వ తేదీన ఉంది. హోలీ అనగానే సాధారణంగా దేశంలోని మధుర-బృందావన్ గుర్తొస్తాయి. కానీ ఇంకా చాలా ప్రాంతాల్లో హోలీ అత్యంత ఘనంగా జరుపుకుంటారు. 

1 /5

పంజాబ్ పంజాబ్‌లో హోలీని హోలా మొహల్లాగా నిర్వహిస్తారు. ఈ రోజున మగవారి పరాక్రమం, వీరత్వానికి శ్రద్ధాంజలి ఘటిస్తారు. రంగులతో హోలీ ఆడతారు. సాయంత్రం వేళ నృత్య కార్యక్రమాలుంటాయి.

2 /5

మంజుల్ కులీ-ఉక్కులీ, కేరళ కేరళలో ఓనం ఎంత ప్రసిద్ధి చెందిందో హోలీ కూడా అంతే. హోలీ ఆనందం పొందాలంటే కేరళ వెళ్లాల్సిందే. కేరళలో హోలీని మంజుల్ కులీ-ఉక్కులీగా పిలుస్తారు. 

3 /5

హంపి, కర్ణాటక కర్ణాటకలోని హంపి గత చరిత్రకే కాకుండా హోలీకు చాలా ప్రసిద్ధి. ఇక్కడి ప్రజలు హోలీ పండుగ కోసం తుంగభద్ర, ఇతర ఉపనదుల్లో స్నానాలు చేస్తారు. కర్ణాటకలో హోలీ రెండ్రోజులపాటు నిర్వహిస్తారు. నలుమూలల్నించి భారీగా జనం తరలివస్తారు. 

4 /5

గోవా గోవాలో హోలీని శిగ్మోగా అభివర్ణిస్తారు. హోలీని వసంతానికి ఆగమనంగా నిర్వహిస్తారు. 

5 /5

డోల్ యాత్ర-అస్సోం అస్సోంలో హోలీ పండుగ చాలా ప్రత్యేకంగా జరుపుకుంటారు. రెండ్రోజులపాటు ఈ ఉత్సవం నడుస్తుంది. హోలీని ఈ రాష్ట్రంలో డోల్ యాత్రగా పిలుస్తారు. మొదటి రోజు మట్టితో చేసిన గుడిసెను తగలబెట్టి హోలికా దనహం చేస్తారు. రెండోరోజు రంగులతో హోలీ జరుపుకుంటారు.