Aadhar card: మీ ఆధార్ కార్డుపై ఎన్ని సిమ్ కార్డ్స్ రిజిస్టర్ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోండి..

SIM Registered with Aadhar card: మన దేశంలో ప్రతి ఒక్కరికీ ఆధార్‌ కార్డు కలిగి ఉంటుంది. అయితే, ఈ ఆధార్‌ కార్డు గుర్తింపు ఆధారంగానే మొబైల్‌ సిమ్‌ కార్డులు కూడా జారీ చేస్తారు. అయితే, ఆధార్‌ కార్డుపై ఎన్ని సమ్‌ కార్డులు రిజిస్టర్‌ అయి ఉన్నాయో ఇలా తెలుసుకోవచ్చు.
 

1 /6

ఇటీవలే ఒక చంఢిఘఢ్‌ మహిళ సిమ్ కార్డ్ స్కామ్ లో భాగంగా రూ. 80 లక్షలు పోగొట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ సైబర్ క్రైమ్ దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. సైబర్ నేరగాళ్లు ఆ మహిళను మోసగించి ఈ డబ్బులను రాబట్టారు. తన ఫోన్‌ నంబర్‌ ఓ చట్టవిరుద్ధమైన కార్యకలాపాల్లో ఉన్నట్లు తేలిందని పోలీసు ఆఫీసరు కాల్‌ చేసినట్లు మభ్యపెట్టారు.   

2 /6

తనపై కేస్‌ బుక్‌ అవుతుందని బెదిరిచడంతో ఆ మహిళ రూ.80 లక్షల వరకు డబ్బును ఆ నేరగాళ్ల ఖాతాల్లో జమా చేసింది. అయితే డిపార్ట్మెంట్ టెలికమ్యూనికేషన్ గైడ్లైన్స్ ప్రకారం ఒక ఆధార్ ఐడి పైన 9 సిమ్ కార్డ్స్ తీసుకోవచ్చు.  

3 /6

ఆధార్ కార్డు మనం దేశవ్యాప్తంగా ఉపయోగిస్తున్నాం ఇది మన గుర్తింపు కోసం. ఆధార్ కార్డు ఉంటేనే సిమ్ కార్డును జారీ చేస్తారు అయితే కొంతమంది ఆధార్ కార్డును ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో ఉపయోగిస్తున్నారు. DOT ఓ పోర్టల్‌ను ప్రారంభించింది. తద్వారా నేరాలను అరికట్టవచ్చని ఈ వెసులుబాటు కల్పించింది. టెలికాం అనలిటిక్స్‌ ఆఫ్‌ ఫ్రాడ్‌ మేనేజ్మెంట్‌ అండ్‌ కన్‌జ్యూమర్‌ ప్రొటెక్షన్‌(TAF-COP) ఇది మన ఆధార్‌ కార్డుతో ఎన్ని మొబైల్ నంబర్స్‌ ఉన్నాయో సులభంగా తెలుసుకునే అవకాశం కల్పించింది.  

4 /6

ఇలా తెలుసుకోండి.. మీ ఆధార్‌ కార్డుపై ఎన్ని సిమ్‌ కార్డులు రిజిస్టర్‌ అయి ఉన్నాయో తెలుసుకోవాలంటే TAFCOP అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయాలి https:tafcop.sacharsaathi.gov.in/telecomUser/ ఆ తర్వాత మీ మొబైల్‌ నంబర్‌ ఇచ్చిన బాక్స్‌లో ఎంటర్‌ చేయాలి.

5 /6

ఇప్పుడు క్యాప్చా ఎంటర్‌ చేస్తే ఓటీపీ రిక్వెస్ట్‌ అడుగుతుంది. ఓటీపీ నమోదు చేసి లాగిన్‌ అవ్వాల్సి ఉంటుంది. అక్కడ మీరు మొబైల్‌ నంబర్‌ లిస్ట్‌ గమనిస్తారు. ఇవి మీ ఆధార్‌ కార్డుకు లింక్‌ అయి ఉంటాయి.  ఈ అన్ని నంబర్స్‌ యాక్టీవ్‌లో ఉన్నాయో లేదో తెలుసుకోండి అవి మీకు సంబంధించవా కావా? అని చూడండి మీకు ఏదైనా సందేహం ఉంటే వెబ్‌సైట్‌లో మూడు ఆప్షన్స్‌ ఉంటాయి, 'Not my number', 'Not required', Required'.

6 /6

మీకు సంబంధం లేని నంబర్లు బ్లాక్‌ చేసే సదుపాయం TAF-COP కల్పిస్తుంది. మీకు సంబంధంలేకుంటే 'Not my number పై క్లిక్ చేయండి.