2024 Indian Movies Top Gross Openings: 2024లో కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ ఖాతాలో మరో రికార్డు..

2024 Indian Movies Top Gross Openings: 2024లో మన దేశంలో పలు సినిమాలు వివిధ భాషల్లో రిలీజయ్యాయి. తాజాగా కమల్ హాసన్ హీరోగా నటించిన ‘భారతీయుడు 2’ మూవీ 2024లో మన దేశంలో ఫస్ట్ డే ఎక్కువ వసూళ్లు సాధించిన చిత్రాల్లో 3వ ప్లేస్ లో నిలిచి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

1 /9

2024లో కమల్ హాసన్ ‘భారతీయుడు 2’ ఖాతాలో మరో రికార్డు.. ఈ మూవీ 2024లో మన దేశంలోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రాల్లో టాప్ 3లో నిలిచింది.

2 /9

  రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన  మూవీ ‘కల్కి 2898 AD’. గత నెల 27న విడుదలైన ఈ సినిమా తొలి రోజు రూ. 191 కోట్ల గ్రాస్ వసూళ్లతో 2024లో టాప్ ప్లేస్ లో నిలిచింది.

3 /9

2024 సంక్రాంతి కానుకగా త్రివిక్రమ్ దర్శకత్వంలో  మహేష్ బాబు హీరోగా నటించిన మూవీ ‘గుంటూరు కారం’. ఈ సినిమా  తొలి రోజు రూ. 90 కోట్ల గ్రాస్ వసూళ్లతో సెకండ్ ప్లేస్ లో ఉంది.

4 /9

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటించిన మూవీ ‘భారతీయుడు 2’. ఈ సినిమా మన దేశంలోనే మొదటి రోజు రూ 58.0 కోట్ల గ్రాస్ వసూళ్లతో నెంబర్ 2 ప్లేస్ లో నిలిచింది.  

5 /9

  హృతిక్ రోషన్ హీరోగా సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ఫైటర్’.  ఈ చిత్రం భారతీయ బాక్సాఫీస్ దగ్గర మన దేశంలో రూ. 35.65 కోట్ల గ్రాస్ వసూల్లతో 2024 లో  టాప్ 4కి పడిపోయింది. 

6 /9

అక్షయ్ కుమార్ , టైగర్ ఫ్రాఫ్, పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన సినిమా ‘బడే మియా ఛోటే మియా’. ఈ సినిమా తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 32 కోట్ల గ్రాస్ వసూళ్లతో 2024లో టాప్ 5లో నిలిచింది. 

7 /9

తేజ సజ్జ దర్శకత్వంలో  ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో  తెరకెక్కిన మూవీ ‘హనుమాన్’. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 24.50 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి టాప్ 6లో నిలిచింది. .

8 /9

సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన  మూవీ ‘టెల్లు స్క్వేర్’. ఈ మూవీ ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ. 23.70 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్ 7లో నిలిచింది. 

9 /9

  అజయ్ దేవగణ్, మాధవన్, జ్యోతిక ముఖ్యపాత్రల్లో నటించిన సినిమా ‘షైతాన్’. ఈ మూవీ తొలి రోజు  ప్రపంచ వ్యాప్తంగా రూ. 21.75 కోట్ల గ్రాస్ వసూళ్లతో టాప్ 8లో నిలిచింది.