Pan Card 2 Alert: ఇన్‌కంటాక్స్ శాఖ పాన్ కార్డు 2.0 లాంచ్ చేసింది. కొత్తగా పాన్ కార్డు తీసుకోవడం, అప్‌డేట్ చేయడం ఇకపై మరింత సులభతరం కానుంది. కొత్త పాన్ కార్డు ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి, ప్రయోజనాలేంటనేది తెలుసుకుందాం.
Pan Card 2 Alert: పాన్ కార్డు ఇక నుంచి కొత్తరూపంలో రానుంది. క్యూఆర్ కోడ్, అదనపు సెక్యూరిటీతో పాన్‌కార్డు 2.0 అందుబాటులో వచ్చింది. కొత్తగా దరఖాస్తు చేసుకునేవారు తగిన డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే పాన్ కార్డు కలిగి ఉన్నవాళ్లు అప్లై చేయాల్సిన అవసరం లేదు. కొత్త పాన్ కార్డుతో కలిగే ప్రయోజనాలేంటో చెక్ చేద్దాం
పాన్ 2.0లో చాలా ప్రయోజనాలున్నాయి. సర్వీస్ వేగంగా ఉంటుది. సెక్యూరిటీ పటిష్టంగా ఉంటుంది. క్యూఆర్ కోడ్ ద్వారా అడ్వాన్స్డ్ ఫీచర్లు ఉంటాయి.
మరో విధానంలో UTIITSL website at https://www.utiitsl.com ఓపెన్ చేసి పాన్ కార్డు, పుట్టిన తేదీ, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు పాన్ కార్డు చేరుతుంది.
ముందుగా ఎన్ఎస్‌డీఎల్ పోర్టల్ ఓపెన్ చేసి మీ పాన్, ఆధార్, పుట్టిన తేదీ వివరాలు సమర్పించాలి. తగిన వివరాలు సమర్పించాలి. ఓటీపీ విధానాన్ని ఎంచుకుని ఓటీపీతో ధృవీకరించుకోవాలి. పేమెంట్ పూర్తయితే పాన్ మీ రిజిస్టర్ మెయిల్ ఐడీకు పాన్ కార్డు వచ్చేస్తుంది
మీ మెయిల్ ద్వారా పాన్ కార్డు కోసం అప్లై చేసేముందు ఎన్ఎస్‌డీఎల్, యూటీఐ పోర్టల్‌లో చెక్ చేసుకోవాలి. ఆన్‌లైన్ ప్రక్రియ పూర్తయితే మీ రిజిస్టర్ మెయిల్ ఐడీకు పాన్ 30 నిమిషాల్లో అందుతుంది.
పాన్ 2.0 కోసం తగిన ఐడీ ప్రూఫ్, ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, అడ్రస్ ప్రూఫ్, యుటిలిటీ బిల్లు, బ్యాంక్ స్టేట్‌మెంట్ లేదా రెంటల్ అగ్రిమెంట్ ఉండాలి. పుట్టిన తేదీ ప్రూఫ్ కోసం బర్త్ సర్టిఫికేట్ లేదా టీసీ ఉండాలి.
ప్రస్తుతం పాన్ కార్డు కలిగినవారందరూ పాన్ 2.0కు అప్‌గ్రేడ్ అవుతారు. ఇప్పటికే పాన్ కార్డు ఉంటే మరోసారి అప్లే చేయాల్సిన అవసరం లేదు. కొత్త క్యూఆర్ కోడ్ వెర్షన్ కోసం రిక్వెస్ట్ చేయాలి. కొత్త దరఖాస్తుదారులైతే తగిన ఐడీ కార్డు, అడ్రస్ ప్రూఫ్ సమర్పించాల్సి ఉంటుంది.
పాన్ 2.0 అనేది ట్యాక్స్ పేయర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేస్తుంది. పిర్యాదుల పరిష్కారం, పేపర్‌లెస్ సేవలు, ఎన్ఎస్‌డీఎల్ పోర్టల్‌లో అందుబాటు ఇకపై మరింత సులభతరం కానుంది. అయితే ఇప్పటికే పాన్ కార్డు కలిగి ఉన్నవాళ్లు ఏం చేయాలి, మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా, దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటనేది తెలుసుకుందాం