Skin Care Foods: అంతర్గత ఆరోగ్యం లేదా బాహ్య ఆరోగ్యం ఏదైనా సరే మనం తినే ఆహారపు అలవాట్లను బట్టి ఉంటుంది. ఆధునిక జీవనశైలిలో వివిధ రకాల ఆహారపు అలవాట్లు, అస్తవ్యస్థమైన జీవన విధానం కారణంగా తక్కువ వయస్సుకే వృద్ధాప్య ఛాయలు కన్పిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటోంది.
Skin Care Foods: అయితే ఆహారపు అలవాట్లు మార్చుకుని డైట్‌లో ఈ 5 పదార్ధాలు ఉండేట్టు చేసుకుంటే మీ చర్మం ఎప్పటికీ నిత్య యౌవనంగా ఉంటుంది. వృద్ధాప్య ఛాయలు దూరమౌతాయి. చర్మం మృదువుగా, అందంగా మారుతుంది. కొన్ని ఫుడ్స్ తీసుకోవడం ద్వారా చర్మం ఎప్పటికీ హైడ్రేట్‌గా ఉంటుంది. ఆ చిట్కాలేవో తెలుసుకుందాం.
కీరా చర్మ సంరక్షణకు కీరా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ముఖాన్ని ఎప్పటికీ హైడ్రేట్‌గా ఉంచడం ద్వారా ముఖంపై గ్లో కొనసాగిస్తుంది. ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే హైడ్రేటింగ్ గుణాలు ఎక్కువ. చర్మ సంరక్షణకు చాలా మంచిది
చిలకడదుంప చర్మానికి నిగారింపు తెచ్చేందుకు చిలకడ దుంప అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ ఇందుకు దోహదపడుతుంది. ముఖంపై ఆయిల్ నియంత్రిస్తుంది. పింపుల్స్, మచ్చలు కూడా పోగొడుతుంది. చర్మానికి సహజసిద్ధమైన నిగారింపుని అందిస్తుంది. ఇందులో ఉండే బీటా కెరోటిన్ చర్మాన్ని దీర్ఘకాలం యౌవనంగా ఉంచుతుంది
యోగర్ట్ యోగర్ట్‌లో యాక్టివ్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు దోహదం చేస్తుంది. ఇందులో ఉండే ల్యాక్టిక్ యాసిడ్ చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేసేందుకు, హైడ్రేట్‌గా ఉంచేందుకు సహాయం చేస్తుంది. ముఖంపై ముడతల్ని తగ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయల్ని దూరం చేస్తుంది. ఇందులో జింక్, విటమిన్ బి2, విటమిన్ బి5, విటమిన్ బి12 పెద్దఎత్తున ఉంటాయి.
క్వినోవా క్వినోవా అంటే ఫ్లవర్ ప్లాంట్. ఇది అమర్‌నాథ్ ఫ్యామిలీకి చెందింది. ఇందులో ప్రోటీన్లు పెద్దఎత్తున ఉంటాయి. ఇందులో ఉండే రైబోఫ్లేవిన్ చర్మం ఎలాస్టిసిటీ, కనెక్టివ్ టిష్యూ ఉత్పత్తిని పెంచుతుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ముఖంపై ముడతలు దూరమౌతాయి
ఓయిస్టర్ ఓయిస్టర్ లేదా సీప్. ఇందులో పోషక విలువలు చాలా ఉంటాయి. ముఖ్యంగా జింక్, ఐరన్, కాపర్, సెలేనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల చర్మం ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటుంది.