Weight Control Tips: ఇటీవలి కాలంలో చెడు ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా స్థూలకాయం అతి పెద్ద సమస్యగా మారుతోంది. పొట్ట వేలాడుతూ నలుగురిలో అసౌకర్యంగా ఉంటోంది. అంతేకాకుండా వివిధ రకాల వ్యాధులకు దారితీస్తోంది. అయితే రోజూ క్రమం తప్పకుండా 5 కూరగాయల జ్యూస్ తాగితే స్థూలకాయానికి సులభంగా చెక్ చెప్పవచ్చు. శరీరంలో కొవ్వంతా మైనంలా కరిగిపోతుంది.
క్యారట్ జ్యూస్ ఇందులో ఉండే విటమిన్ ఎ, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. దాంతోపాటు యాంటీ ఆక్సిడేటివ్ గుణాలుంటాయి. సెల్స్ దెబ్బతినకుండా కాపాడుతాయి. ఇందులో విటమిన్ ఇ, యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ అద్బుతంగా తగ్గుతాయి. బ్లడ్ ప్రెషర్ నియంత్రించేందుకు గుండె సమస్యలకు చెక్ పెట్టేందుకు పనిచేస్తుంది.
బీట్రూట్ జ్యూస్ ఇందులో ఉండే పోషకాలు ముఖ్యంగా ఫైబర్, ఫోలేట్, నైట్రేట్, యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. స్ట్రోక్ సమస్యను తగ్గిస్తుంది. రక్త నాళాల్లో రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది.
టొమాటో జ్యూస్ ఇందులో ల్యూటిన్, జెక్సౌన్థిన్ పదార్ధం ఉంటుంది. డిజిటల్ ఎక్విప్మెంట్ల కారణంగా తలెత్తే బ్లూ లైటింగ్ నుంచి కంటిని కాపాడుతాయి. ఇందులో ఉండే లైకోపీన్ చెడు కొలెస్ట్రాల్ వేగంగా తగ్గిస్తుంది. బ్లడ్ ప్రెషర్ కూడా తగ్గిస్తుంది.
పాలకూర జ్యూస్ పాలకూర జ్యూస్‌లో పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పెద్దమొత్తంలో ఉంటాయి. ఇవి చర్మ సంరక్షణ, హార్ట్ హెల్త్ మెరుగుపర్చేందుకు దోహదం చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు స్వెల్లింగ్ సమస్యను తగ్గిస్తాయి. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
దోసకాయ జ్యూస్ ఇందులో ఫైబర్, విటమిన్, ఖనిజాలతో పాటు 95 శాతం వాటర్ ఉంటుంది. దీనివల్ల శరీరం హైడ్రేట్‌గా ఉంటుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ దూరం చేస్తుంది. ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. కిడ్నీ పనితీరును మెరుగుపరుస్తుంది