How To Recover Deleted Whatsapp Photos: ప్రస్తుతం ఇంటర్నెట్ యుగంలో వాట్సాప్‌లేనిదే ఏ పనిసాగడం లేదు. కోట్లాది మంద నిత్యం వాట్సాప్‌లోనే ఎక్కు సమయం గడుపుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్ ఉంది. ఈ యాప్‌లో సందేశాలే కాకుండా ఫోటోలు, వీడియోలు, అనేక మీడియా ఫైల్‌లు కూడా షేర్ చేయవచ్చు. అయితే స్టోరేజ్ సమస్యల వల్ల మనం చాలాసార్లు వాట్సాప్ నుంచి ఫైల్‌లను తొలగిస్తాం. ఒక్కోసారి అనుకోకుండా ఇంపార్టెంట్ ఫొటోలు, వీడియోలు కూడా డిలీట్ చేస్తాం. అయ్యో అన్ని ఫొటోలు, వీడియోలు పోయాయని బాధపడతాం. ఇక నుంచి మీకు ఆ టెన్షన్ అక్కర్లేదు. డిలీట్ చేసిన ఫొటోలు, వీడియోలను ఈ ట్రిక్స్ ఉపయోగించి మళ్లీ తిరిగి పొందండి.
వాట్సాప్ ఫొటోలు, వీడియోలు మన ఫోన్ గ్యాలరీలో డిఫాల్ట్‌గా సేవ్ అవుతాయి. మీరు వాట్సాప్ నుంచి వీటిని తొలగించినా.. గ్యాలరీకి వెళ్లి చూడగలరు. గూగుల్ ఫొటోలలో సేవ్ అయి ఉంటాయి.
యాప్ చాట్‌లు, మీడియాను ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ డ్రైవ్‌కు, iOS వినియోగదారుల కోసం iCloudకి బ్యాకప్ చేస్తుంది. రోజువారీ బ్యాకప్ తర్వాత ఫైల్స్ తొలగించినా.. గూగుల్ డ్రైవ్ లేదా iCloud నుంచి బ్యాకప్‌ని పొందవచ్చు.
ముందుగా మీ స్మార్ట్ ఫోన్‌లో వాట్సాప్‌ను అన్‌స్టాల్ చేసి.. మళ్లీ ఇన్‌స్టాల్ చేయండి. అదే నంబర్‌తో మళ్లీ లాగిన్ అవ్వండి.
మీరు బ్యాకప్ నుంచి డేటాను పునరుద్ధరించమని ఓ నోటిఫికేషన్ వస్తుంది. దానిని అంగీకరించండి. సెటప్ పూర్తయిన తర్వాత.. మీడియా ఫైల్స్, మెసేజ్‌లు తిరిగి వస్తాయి.
మీడియా ఫోల్డర్ నుంచి వాట్సాప్ మీడియాని పునరుద్ధరించే ఎంపిక ఆండ్రాయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ముందుగా File Explorer యాప్‌ను తెరవండి. వాట్సాప్ ఫోల్డర్‌కి వెళ్లి.. మీడియా, వాట్సాప్ ఫొటోల ఫోల్డర్‌కి వెళ్లండి. ఇక్కడ మీరు అన్ని ఫొటోలను చూడొచ్చు. ఇక్కడ మీరు డిలీట్ చేసిన ఫోటోలు లేదా మీడియాను కూడా పొందవచ్చు.