Ind vs Pak Head to Head Records: ఇండియా పాకిస్తాన్ టీ20 మ్యాచ్ రేపే, ఎవరిది ఆధిక్యం

ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ ప్రారంభమైంది. అమెరికా వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న టోర్నీలో దాయాది దేశాలు తలపడనున్నాయి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటేనే హై ఓల్టేజ్ మ్యాచ్. రెండు దేశాల హెడ్ టు హెడ్ రికార్డుల గురించి పరిశీలిద్దాం.

Ind vs Pak Head to Head Records: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 టోర్నీ ప్రారంభమైంది. అమెరికా వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న టోర్నీలో దాయాది దేశాలు తలపడనున్నాయి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అంటేనే హై ఓల్టేజ్ మ్యాచ్. రెండు దేశాల హెడ్ టు హెడ్ రికార్డుల గురించి పరిశీలిద్దాం.

1 /5

ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన టీ20 లలో అత్యధిక వికెట్లు సాధించిన ఆల్‌రౌండర్లలో హార్దిక్ పాండ్యా ఉన్నాడు. ఇప్పుటివరకూ 11 వికెట్లు పడగొట్టాడు.

2 /5

టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్ల జాబితాలో టీమ్ ఇండియాకు చెందిన విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా 5 మ్యాచ్‌లు ఆడి 308 పరుగులు చేశాడు. 

3 /5

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య టీ20 ప్రపంచకప్‌లో ఇండియా పాకిస్తాన్ దేశాలు ఆరుసార్లు తలపడ్డాయి. ఇందులో ఇండియా 5, పాకిస్తాన్ 1 మ్యాచ్ గెలిచాయి. 

4 /5

టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఇండియా పాకిస్తాన్ దేశాల మధ్య హెడ్ హెడ్ రికార్డుల్ని పరిశీలిస్తే..ఇండియా ఆధిక్యత కనబరుస్తోంది. రెండు జట్లు ఇప్పటివరకూ 12 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో తలపడగా ఇండియా 9 మ్యాచ్‌లు గెలిచింది. పాకిస్తాన్ కేవలం 3 మ్యాచ్‌లలో విజయం సాధించింది.

5 /5

తొలి మ్యాచ్ ఐర్లండ్‌పై విజయం సాధించిన టీమ్ ఇండియా రేపు ఆదివారం రెండవ మ్యాచ్ ఆడనుంది. న్యూయార్క్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో విజయంతో సూపర్ 8 పొజిషన్ పటిష్టం చేసుకోవచ్చు. అమెరికాతో తొలి మ్యాచ్ ఓడిన పాకిస్తాన్‌కు ఇది అత్యంత కీలకం కానుంది.