Allu Arjun Top Movies List: అల్లు అర్జున్‌ కెరీర్‌లో టాప్ చిత్రాలు.. Part -1

Allu Arjun Top Movies List Part 1: అల్లు అర్జున్.. మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్‌తో ఎంట్రీ ఇచ్చిన తన కంటూ ప్రత్యక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేకాదు పుష్ప మూవీతో జాతీయ అవార్డు అందుకున్నారు. త్వరలో పుష్ప 2 మూవీతో పలకరించబోతున్నాడు.  ఈ రోజు అల్లు అర్జున్ బర్త్ డే సందర్బంగా ఈయన కెరీర్‌లో టాప్ చిత్రాల విషయానికొస్తే..

1 /6

పుష్ప .. ది రైజ్.. (Pushpa..part -1 The Rise) అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీలో టైటిల్ రోల్ పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ పరకాయ ప్రవేశం చేసాడు.ఈ సినిమాలో నటనకు జాతీయ స్థాయిలో బెస్ట్ యాక్టర్‌గా అవార్డు అందుకున్నారు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీ నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి నటుడిగా రికార్డు క్రియేట్ చేసాడు.

2 /6

అల వైకుంఠపురములో.. (Ala Vaikunthapurramloo) త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు బన్ని కెరీర్‌లో డిఫరెంట్ మూవీగా నిలిచిపోయింది.

3 /6

సరైనోడు.. (Sarrainodu) బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా  గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

4 /6

రుద్రమదేవి.. (Rudramdevi) గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క టైటిల్ రోల్లో తెరకెక్కిన రుద్రమదేవిలో అల్లు అర్జున్ గోనా గన్నారెడ్డి పాత్రలో మెప్పించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఓ మోస్తరు విజయం సాధించింది.

5 /6

సన్నాఫ్ సత్యమూర్తి (S/O Satyamurthy) మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన మూవీ 'సన్నాఫ్ సత్యమూర్తి'.  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయమే సాధించింది.

6 /6

రేసు గుర్రం (Race Gurram) అల్లు అర్జున్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరెక్కిన మూవీ 'రేసు గుర్రం'. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. బన్ని కెరీర్‌లో స్పెషల్ మూవీగా నిలిచింది.