Aadhaar Card History: భారతీయులకు అన్నింటికి ఆధారం ఆధార్ కార్డు. అందుకే ఈ ఆధార్ కార్డు విషయంలో చాలా జాగ్రత్తగాఉండాలి. మీకు తెలియకుండానే మీ ఆధార్ కార్డును ఎవరైనా వినియోగించారన్న అనుమానం మీలో ఉందా. దీని గురించి మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా. ఆధార్ ను దుర్వినియోగం చేశారనేది బయోమెట్రిక్ లాక్ వేయాలా..ఆన్ లైన్ లో దీనిని ఈజీగా చేసుకోవచ్చు.
Aadhaar Card History: ఆధార్ కార్డు భారతీయులకు చాలా ముఖ్యమైంది. బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలన్నా..పాన్ కార్డు కోసమైనా..ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలన్నా..మన ఐడెంటిటీ లేదా అడ్రస్ ప్రూఫ్ కోసమైనా..ఇలా చాలా వాటికి ఆధార్ కార్డు తప్పకుండా అవసరం అవుతోంది.
మనం నిత్యం వినియోగించే డాక్యుమెంట్లలో ఆధార్ కార్డు కూడా చాలా కీలకంగా మారింది. ఎక్కడికి వెళ్లినా.మనం కచ్చితంగా ఆధార్ వెంట తీసుకెళ్లాల్సిందే. ఎక్కడ అడిగినా అవసరం ఉంటే ఆధార్ నెంబర్ ఇస్తుంటాం. ఈ క్రమంలోనే ఆధార్ కార్డు వివరాలను ఎక్కడెక్కడ మనం ఇస్తున్నాము..దీన్ని ఎక్కడెక్కడ వాడుతున్నారో తెలియడం లేదు.
ఈ సమయంలోనే మనకు మన ఆధార్ కార్డు దుర్వినియోగం అయ్యిందా అనే సందేహం కూడా కలుగుతుంది. ఈ విషయం తెలుసుకోవాలంటే మనం ఆధార్ కార్డు హిస్టరీ తెలుసుకోవాల్సిందే. దీని సాయంతో ఆధార్ కార్డును మన అనుమతి లేకుండా ఎవరైన వినియోగించారో లేదో సులభంగా తెలుసుకోవచ్చు.
ఆధార్ నెంబర్ ను ఎక్కడెక్కడ వినియోగించామో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముందుగాదీనికోసం ఉడాయ్ వెబ్ సైట్లోకి వెళ్లాలి. అందులో పైన ఎడమ వైపు మై ఆధార్ ఆప్షన్ లో కనిపించే ఆధార్ సర్వీసెస్ సెక్షన్లో ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. వెంటనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసి..ఆధార్ కార్డు నెంబర్, క్యాప్చా కోడ్, ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
ఆ తర్వాత కనిపించే స్కీన్ ల కిందికి స్క్రోల్ చేస్తుంటే అథెంటికేషన్ హిస్టరీ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. అక్కడ ఆల్ ను సెలక్ట్ చేసుకుని డేట్ సెలక్ట్ చేసి ఫెచ్ అథెంటికేషన్ హిస్టరీపై క్లిక్ చేయాలి. మీ ఆధార్ కు లింక్ చేసిన ఓటీపీ, బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ ద్వారా మీ ఆధార్ కార్డును ఆరు నెలలుగా ఎక్కడెక్కడ వినియోగించారనే డేటా మీరు చూసుకోవచ్చు.
అక్కడ హిస్టరీలో మీకు తెలియకుండా ఎక్కడైనా ఆధార్ వినియోగించినట్లు అనిపించినట్లయితే 1947 నెంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. లేదంటే help@uidai.gov.in కు మెయిల్ కూడా చేయవచ్చు. లేదంటే ఉడాయ్ వెబ్ సైట్లో నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. ఇంకా ఇలాంటి ఘటనల్లో ఇంకోసారి జరగకుండా బయోమెట్రిక్ లాక్ చేసుకోవచ్చు.
మీ ప్రమేయం లేకుండానే ఆధార్ కార్డు వినియోగించడం ఎట్టి పరిస్థితుల్లో కుదరదు. దీనికోసం కూడా ఉడాయ్ పోర్టర్లలోనే ఆధార్ నెంబర్ ఓటీపీతో లాగిన్ అయి బయోమెట్రిక్ లాంగ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ లాక్ చేసి సేఫ్ గా ఉంచుకోవచ్చు.