Sobhita Dhulipa Wedding: నాగచైతన్య శోభితా ధూళిపాల పెళ్లి డేట్ లను మార్చుకోవాలని అనుకుంటున్నారంట. ఈ క్రమంలో ఒక వార్త ప్రస్తుతం నెట్టంట తెగ హల్ చల్ చేస్తుంది. దీంతో అక్కినేని అభిమానులు మాత్రం పెద్ద షాక్ కు గురౌతున్నారంట.
నాగచైతన్య, శోభితాళ ఇద్దరు ప్రేమించి ఒక్కటౌతున్న విషయం తెలిసిందే. ఆగస్టు నెల 8 వ తేదీన వీరి ఎంగెజ్ మెంట్ కొద్ది మంది బంధువులు, స్నేహితుల మధ్య జరిగింది. హీరో నాగార్జున అక్కినేని నాగచైతన్య కాబోయే కోడలు శోభితల ఎంగెజ్ మెంట్ పిక్స్ ను తన ఇన్ స్టాలో షేర్ చేశారు.
చైతు, శోభితల మధ్య చాలా ఏళ్లు సీక్రెట్ గా ప్రేమ నడిచిందంట. అయితే..వీరి ఎంగెజ్ మెంట్ కాగానో వేణు స్వామిరంగంలోకి దిగి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ ఘటనపై పెద్ద దుమారమే చెలరేగింది. సమంతా మాదిరిగా.. శోభితాతో కూడా డైవర్స్ అయిపోతుందని వేణు స్వామి చెప్పారు.
అంతే కాకుండా.. 2027లో ఒక్క అమ్మాయి వల్ల వీరిద్దరు విడిపోతారని బాంబు పేల్చాడు. అప్పటి నుంచి పెద్ద రచ్చ నడుస్తొంది. ఇటీవల శోభితా ధూళిపాళ ఇంట పసుపు దంచుడు కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది. దీనికి సంబంధించిన పిక్స్ వైరల్ అయ్యాయి. శోభితా సిస్టర్ సమంతా.. ఈ వేడుకలో స్పెషగా పాల్గొన్నారు.
అంతే కాకుండా.. అక్కినేని నాగచైతన్య, శోభితల పెళ్లి అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగనున్నాయని, పెళ్లి డిసెంబర్ 4 న జరుగనున్నట్లు ప్రకటన వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై ప్రస్తుతం నాగార్జున ఫ్యామిలీ యూటర్న్ తీసుకున్నట్లు తెలుస్తొంది. గతంలో వేణు స్వామి డైవర్స్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ఆయన మరో జ్యోతిష్యుడ్ని సంప్రదించారంట. ఆయన కూడా కొన్ని పూజలు,హోమాలు జరిపిస్తే మంచిదని చెప్పారంట. దీంతో నాగార్జున మాత్రం డిసెంబర్ 4 పెళ్లితేదీపై రకరకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. నాగార్జున పెళ్లి తేదీని మారుస్తున్నారంట.
మళ్లీ పూజలు, హోమాలు చేయించిన తర్వాత కొత్తగా డెట్ అనౌన్స్ మెంట్ చేస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య , శోభితాల పెళ్లి జరుగుతుందా.. లేదా అన్నదానిపై బిగ్ సస్పెన్స్ నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ రూమర్స్ పై అక్కినేని నాగార్జున ఫ్యామిలీ ఎవరైన స్పందిస్తే మాత్రం సరైన క్లారిటీ రానుంది.