ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్‌కు ప్రధానమంత్రి అయిన తొలి క్రికెటర్ కాదు. అంతకు ముందు ప్రధానిగా సేవలందించిన నవాజ్ షరీఫ్ కూడా క్రికెటరే. క్లబ్ క్రికెటరైన నవాజ్.. ఒక్క ఫస్ట్ క్లాస్ క్రికెట్ మాత్రమే ఆడారు. అదే చివరి మ్యాచ్ కూడా.
ఫస్ట్ క్లాస్ క్రికెటరైన సర్ అలెక్ డగ్లస్-హోమ్ బ్రిటన్ ప్రధానిగా సేవలందించారు. మిడిల్ సెక్స్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయాల తరఫున 10 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడారు. యూకే ప్రధానిగా అక్టోబర్ 1963- అక్టోబర్ 1964 వరకు బాధ్యతలు నిర్వహించారు. 1966లో ఎంసీసీ అధ్యక్షుడయ్యారు.
సర్ ఫ్రాన్సిస్ బెల్ న్యూజిలాండ్‌లో జన్మించి పదవి చేపట్టిన తొలి ప్రధాన మంత్రి. 1925వ సంవత్సరం మే 10-30 వరకు ప్రధాన మంత్రిగా 20 రోజులు పనిచేశారు. 1870లో రెండు ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచులను విల్లింగ్స్టన్లో ఆడారు. విలియం మెస్సీ మరణానంతరం తాత్కాలిక ప్రధానిగా ఆయన ప్రధాని బాధ్యతలు చేపట్టారు.
కమిసేస్ మారా, ఫిజీ దేశ ఆధునిక చరిత్రలో ప్రసిద్ధి చెందినవారు. బ్రిటీషు ప్రభుత్వం నుండి స్వాతంత్య్రం పొందాక ప్రధానిగా 21 సంవత్సరాలు, దేశాధ్యక్షుడిగా 7 సంవత్సరాలు పనిచేశారు. 1953/54లో ఫిజీ దేశం తరఫున రెండు ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌లు ఆడారు. వైస్-కెప్టెన్‌గా పనిచేశారు.
Next Gallery