Yashasvi Jaiswal Out or Not Out: బోర్డర్-గవాస్కర్ నాలుగో టెస్ట్‌లో టీమిండియా దారుణ ఓటమిని మూటగట్టుకుంది. ఆసీస్ విధించిన 340 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. 155 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 184 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్ ఔట్‌పై నెట్టింట తీవ్ర దూమరం చెలరేగుతోంది. స్నికో మీటర్‌లో స్పైక్స్ రాకపోయినా థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించడాన్ని తప్పుబడుతున్నారు. సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేస్తున్నారు.
Yashasvi Jaiswal was completely not out.
— Crick Forecast (@crickforecast) December 30, 2024
If you do not make decision based on snico then why you preferring it for ultra edge..??#INDvsAUS #AUSvINDIApic.twitter.com/0upBmWEawB
అప్పటికి టీమిండియా స్కోరు 141 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. హాఫ్ సెంచరీతో క్రీజ్‌లో పాతుకుపోయాడు జైస్వాల్. మరో ఎండ్‌లో వాషింగ్టన్ సుందర్ చక్కటి సహకారం అందిస్తున్నాడు.
ఈ జంట 8 ఓవర్లపాటు ఇవ్వకపోవడంతో డ్రాపై ఆశలు చిగురించాయి. అయితే కమిన్స్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ (84) ఔట్ కావడంతో కథ మొత్తం మారిపోయింది.
జైస్వాల్ ఆడిన బంతి నేరుగా వికెట్ కీపర్ క్వారీ చేతుల్లో పడింది. ఆసీస్ ఫీల్డర్లు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.
ఆసీస్ కెప్టెన్ కమిన్స్ రివ్యూ కోరాడు. రిప్లైలో స్నికో మీటర్‌లో స్పైక్స్ కనిపించలేదు. దీంతో తాను ఔట్ కాలేదని జైస్వాల్ రిలాక్స్ అయ్యాడు.
కానీ థర్డ్ అంపైర్ మాత్రం ఔట్‌గా ప్రకటించాడు. దీంతో జైస్వాల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. స్పైక్స్ లేకున్నా ఎలా ఔట్ ఇస్తారని ఫీల్డ్ అంపైర్లతో చర్చించాడు. బాల్ టర్న్ కావడంతో అంపైర్ ఔటిచ్చాడు. అంపైర్ నిర్ణయం వివాదస్పదంగా మారింది.
అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తునే పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. జైస్వాల్ ఔట్ అయిన తరువాత టీమిండియా వేగంగా వికెట్లు కోల్పోయింది.
థర్డ్ అంపైర్ నిర్ణయంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అంపైర్ ఓపెన్ చీటింగ్ చేశాడని.. జైస్వాల్ ఉంటే మ్యాచ్ డ్రాగా ముగిసేదని అంటున్నారు.