India vs Sri Lanka Highlights: ఆఖర్లో శ్రీలంక అద్భుతం, తొలి వన్డే టై.. సూపర్ ఓవర్ లేకపోవడానికి కారణం ఇదే..!

Ind vs SL 1st ODI Highlights and Super Over Rules: టీ20 సిరీస్‌ గెలిచి ఊపుమీద ఉన్న భారత్‌కు తొలి వన్డేలో శ్రీలంక నుంచి గట్టి పోటీ ఎదురైంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌ను శ్రీలంక అద్భుతంగా పోరాడి టైగా మార్చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్.. అంతేస్కోరుకు ఆలౌట్ అయింది. కెప్టెన రోహిత్ శర్మ (58) హాఫ్ సెంచరీతో రాణించగా.. మ్యాచ్ టై అయిన సమయంలో శివమ్ దూబే (25) ఔట్ అవ్వడం, ఆ తరువాతి బంతికే అర్ష్‌దీప్ సింగ్ (0) డకౌట్ కావడంతో మ్యాచ్ ఊహించని విధంగా డ్రాగా ముగిసింది. 
 

1 /6

మ్యాచ్ టైగా ముగియడంతో సూపర్ ఓవర్ నిర్వహిస్తారేమోనని అభిమానులు అనుకున్నారు. ప్రస్తుతం వన్డేల్లో సూపర్ ఓవర్ విధానం లేదు. ఐసీసీ నిబంధనల ప్రకారం టీ20 మ్యాచ్‌ల్లో మాత్రమే సూపర్‌ ఓవర్‌ విధానం ఉంటుంది. వన్డే మ్యాచ్‌లకు ఈ నియమాలు లేవు.  

2 /6

టీ20 మ్యాచ్‌ల్లో ఫలితం తేలకపోతే సూపర్ ఓవర్లను ప్రవేశపెడతారు. అయితే ప్రస్తుతం వన్డేల్లో అలాంటి నిబంధన లేదు. టెస్టులు, వన్డేలు, టీ20లకు డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి. వన్డేల్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే సూపర్‌ ఓవర్ నిర్వహించారు.  

3 /6

2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ మధ్య సూపర్ ఓవర్ జరిగింది. అయితే అది కూడా టైగా ముగిసింది. బౌండరీల ఆధారంగా విజేతను ప్రకటించారు. ఆ తరువాత జింబాబ్వే-పాకిస్థాన్‌ల మధ్య 2020 వన్డే సూపర్ ఓవర్‌లో ముగిసింది.  

4 /6

గతేడాది వెస్టిండీస్, నెదర్లాండ్స్ మధ్య ఐసీసీ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ సమయంలో సూపర్ ఓవర్ ద్వారా విజేతను నిర్ణయించారు. 1987లో భారత్,‌ పాకిస్థాన్‌ , 1988లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లు టై అవ్వగా.. తక్కువ వికెట్లు కోల్పోయిన జట్టును విజేతగా ప్రకటించారు.  

5 /6

శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత్ 15 బంతుల్లో 1 పరుగు చేయాల్సిన దశలో వరుసగా రెండు వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ టైగా ముగిసింది.   

6 /6

మిగిలిన రెండు వన్డేలు గెలిచిన జట్టు సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది. రెండో వన్డే ఆగస్టు 4న జరగనుంది.