Ind vs WI: వెస్టిండీస్ టెస్ట్ సిరీస్‌లో టీమ్ ఇండియా ప్లేయింగ్ 11 నుంచి ఈ ఐదుగురు అవుట్

Ind vs WI: టీమ్ ఇండియా జూలై 12 నుంచి వెస్టిండీస్ పర్యటన ప్రారంభం కానుంది. వెస్టిండీస్‌తో టీమ్ ఇండియా 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది. వెస్టిండీస్ పర్యటన నిమిత్తం బీసీసీఐ ఇప్పటికే టీమ్ ప్రకటించింది. కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా అజింక్యా రహానే ఉంటారు.

Ind vs WI: వెస్టిండీస్‌తో జరిగే 2 టెస్ట్‌ల సిరీస్ సందర్భంగా టీమ్ ఇండియా కెప్టెన్ ఐదుగురు ఆటగాళ్లపై వేటు వేయవచ్చని తెలుస్తోంది. ఈ ఐదుగురిలో విరాట్ కోహ్లి అనుచరుడు కూడా ఉండవచ్చని తెలుస్తోంది. 

1 /6

టీమ్ ఇండియా జూలై 12 నుంచి వెస్టిండీస్‌తో 2 టెస్ట్ మ్యాచ్‌లు సిరీస్ ఆడనుంది. దీనికోసం 16 మంది సభ్యుల టీమ్‌ను బీసీసీఐ ఎంపిక చేసిన రోహిత్ శర్మకు అప్పగించింది. మరి టీమ్ 11లో ఎవరుంటారు, ఏ ఐదుగురు బయటకు వెళ్తారనేది రోహిత్ శర్మ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.

2 /6

యశస్వి జైశ్వాల్ 21 ఏళ్ల ఈ బ్యాటర్ తొలిసారి టెస్ట్ జట్టులోకి వచ్చాడు. అయితే డెబ్యుూ అప్పుడే కాకపోవచ్చన్పిస్తోంది. ఇతనికి పోటీగా రుతురాజ్ గైక్వాడ్ ఉండటంతో యశస్వి జైశ్వాల్‌కు స్థానం కష్టమే అన్పిస్తోంది. 

3 /6

నవదీప్ సైని 30 ఏళ్ల ఈ క్రికెటర్‌ను ప్లేయింగ్ 11 నుంచి బయటపెట్టడం రోహిత్ శర్మకు అంత సులువేం కాదు. ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీతో కలిసి ఆర్సీబీకు ఆడాడు. నవదీప్ సైని కెరీర్‌లో ఇప్పటి వరకూ 2 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. 4 వికెట్లు తీశాడు. 8 వన్డేలు , 11 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 

4 /6

ముకేష్ కుమార్ బీహార్‌కు చెందిన పేసర్. ఇంతకుముందు కూడా జట్టులో చేరినా ప్లేయింగ్ 11లో చోటు దక్కలేదు. 29 ఏళ్ల ముకేష్ కుమార్ ఇప్పటి వరకూ 39 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి 149 వికెట్లు పడగొట్టాడు. ఇంకా అంతర్జాతీయ మ్యాచ్ ఆడలేదు.

5 /6

టీమ్ 11 నుంచి బయట ఉంటే క్రికెటర్లలో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ ఇషాన్ కిషన్ పేరు విన్పిస్తోంది. టెస్ట్ జట్టులో ఇషాన్ కిషన్‌తో పాటు శ్రీకర్ భరత్ ఉన్నారు. కేఎస్ భరత్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో ఆడాడు. వికెట్ కీపింగ్ అద్భుతంగా చేయడంతో తిరిగి అతనికే అవకాశముంటుంది.

6 /6

అక్షర్ పటేల్ ప్లేయింగ్ 11లో చోటు ఉండకపోవచ్చు. 29 ఏళ్ల అక్షర్ పటేల్ ఓ ఆల్ రౌండర్. ఇతనికి పోటీగా టీమ్ లో రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు. అందుకే ప్లేయింగ్ 11 కష్టమే