Indian Railways Ticket Booking Rules: ప్రయాణిలకు మరింత సులభంగా సేవలు అందించేందుకు ఇండియన్ రైల్వేస్ ఎప్పటికప్పుడు కొత్త రూల్స్ ప్రవేశపెడుతోంది. తాజాగా రైలు టికెట్ బుకింగ్, రైలు లగేజీ ఛార్జీలకు సంబంధించి రైల్వే శాఖ కీలక మార్పులు చేసింది. కొత్త నిబంధనలు డిసెంబర్ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది. రైల్వేలో జరిగిన మార్పులు ఏంటి..? ప్రయాణికులకు ఎంత వరకు ప్రయోజనం ఇక్కడ తెలుసుకుందాం..
తాజ్, గోమతి వంటి డే టైమ్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్‌లో అడ్వాన్స్ బుకింగ్ కోసం తక్కువ టైమ్ లిమిట్ కొనసాగుతాయని రైల్వే అధికారులు వెల్లడించారు.
ఇటీవల తీసుకువచ్చిన రైలు టికెట్ బుకింగ్ నిబంధనల్లో విదేశీ ప్రయాణికులకు మినహాయించింది. రైలు ప్రయాణానికి 365 రోజుల ముందు వరకు టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. మన దేశ ప్రయాణికులు మాత్రం రైలు ప్రయాణానికి 60 రోజులలోపు మాత్రమే టికెట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది.
అక్టోబర్ 31వ తేదీలోపు 120 రోజుల ముందు రైలు టికెట్స్‌ను బుక్ చేసుకున్న ప్రయాణికులకు టికెట్ క్యాన్సిలేషన్ రూల్స్ యాథావిధిగా వర్తిస్తాయి. ఆ తరువాత బుక్ చేసుకున్న ప్రయాణికులు కొత్త నిబంధనల ప్రకారం క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుంది.
రైలు టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికుల వివరాలను పక్కాగా నమోదు చేయనున్నారు. ఒకరి పేరు మీద మరొకరు ప్రయాణిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో మరింత కఠినంగా వ్యవహరించాలని రైల్వేశాఖ భావిస్తోంది.
టికెట్ బుక్ చేసుకున్న తర్వాత తాము ప్రయాణించలేకపోతే.. 48 గంటల ముందు సమీపంలోని రైల్వే స్టేషన్‌కు వెళ్లి తమ స్థానంలో వెళ్లే కొత్త ప్రయాణికుడి గురించి వివరాలు అందజేయాలి. అప్పుడు ఒకరు బుక్ చేసుకున్నా.. మరొకరు ప్రయాణించే అవకాశం ఉంటుంది.
లగేజీ విషయంలో కూడా రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారీ మొత్తంలో లగేజీని ఉచితంగా తీసుకెళ్లవచ్చు. రైల్వే నిబంధనలకు మించి బ్యాగేజీ ఫీజు చెల్లించకుండా తీసుకువెళ్లేవారికి జరిమానా విధించాలని అధికారులు ఆదేశించారు.