India Test Victory: రాజ్‌కోట్ మైదానంలో మూడవ టెస్ట్‌లో ఇంగ్లండ్‌పై టీమ్ ఇండియా సాధించిన విజయం భారతదేశ టెస్ట్ చరిత్రలో అతిపెద్దదిగా భావించవచ్చు. ఈ మ్యాచ్‌లో ఇండియా 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచింది. ఇండియా ఇప్పటి వరకూ ఆడిన 577 టెస్ట్ మ్యాచ్‌లలో టాప్ 5 విజయాలు ఏమున్నాయో తెలుసుకుందాం..
2008లో టీమ్ ఇండియా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఆ దేశాన్ని 320 పరుగుల తేడాతో మట్టికరిపించింది.
2016 అక్టోబర్ నెలలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ డబుల్ సెంచరీ, అజింక్యా రహానే సెంచరీతో ఇండియా 321పరుగుల తేడాతో విజయం సాధించింది.
డిసెంబర్ 2015లో జరిగిన మరో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ నేతృత్వంలో టీమ్ ఇండియా...దక్షిణాఫ్రికాపై337 పరుగుల తేడాతో గెలిచింది.
డిసెంబర్ 2021లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్ ఏజాజ్ పటేల్ ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికట్లు తీసి రికార్డు నెలకొల్పాడు. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఇండియా 372 పరుగుల తేడాతో విజయం సాధించింది.
టీమ్ ఇండియా 5 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో రాజ్‌కోట్‌లో జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్‌లో 434 పరుగుల తేడాతో ఇండియా విజయం సాధించింది. రోహిత్ శర్మ నేతృత్వంలో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్‌లో శుభమన్ గిల్ సెంచరీ కొట్టగా, యశస్వి జైశ్వాల్ డుబుల్ సెంచరీ సాధించాడు.
ఈ టెస్ట్ కంటే ముందు ఇండియా..న్యూజిలాండ్‌పై అతిపెద్ద విజయం సాధించింది. ఇండియా సాదించిన టాప్ 5 టెస్ట్ విజయాలను పరిశీలిద్దాం
రాజ్‌కోట్‌లో జరిగిన మూడవ టెస్ట్ మ్యాచ్‌లో ఇండియా 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై విజయం సాధించింది. ఇడియా ఇప్పటి వరకూ 577 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. ఇంగ్లండ్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఆ దేశానికి ఇది రెండవ అతిపెద్ద పరాజయం.