Top 7 Medical Colleges: నీట్ పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ప్రవేశాలు జరుగుతున్నాయి. అయితే టాప్ మెడికల్ కళాశాలల్లో ప్రవేశం లభించాలంటే ర్యాంక్ కూడా మెరుగ్గా ఉండాలి. ఈ నేపధ్యంలో ఢిల్లీలోని టాప్ 7 మెడికల్ కళాశాలలేవో తెలుసుకుందాం. ఈ మెడికల్ కళాశాలల ఫీజు కూడా తక్కువే.
యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్స్ ఈ కళాశాల 1971లో స్థాపించారు. ఢిల్లీలోని బెస్ట్ 7 కళాశాలల్లో ఇదొకటి. ఈ కళాశాలలో కూడా ఫీజు చాలా తక్కువ.
మౌలానా ఆజాద్ మెడికల్ కళాశాల ఢిల్లీలోని టాప్ 7 మెడికల్ కళాశాలల్లో ఇదొకటి. ఎంబీబీఎస్కు బెస్ట్ ఆప్షన్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగులో 24వ స్థానం.
లేడీ హార్డింగ్ మెడికల్ కళాశాల లేడీ హార్డింగ్ మెడికల్ కళాశాల ఢిల్లీలోని టాప్ వైద్య కళాశాలల్లో ఒకటి. ఈ ఏడాది ఎన్ఐఆర్ఎఫ్ జరిపిన ర్యాంకింగుల్లో 29వ స్థానంలో ఉంది
జామియా హమ్దర్ద్ యూనివర్శిటీ జామియా హమ్దర్ద్ హయ్యర్ ఎడ్యుకేషన్ దేశంలోనే అతిపెద్ద సంస్థ. 1989లో స్థాపించారు. ఈ కళాశాల ఫీజు కూడా ఇతర కళాశాలలతో పోలిస్తే చాలా తక్కువ.
ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బాయిలరీ సైన్సెస్ ఈ కళాశాల ఈ ఏడాదిలో మూడవ స్థానంలో నిలిచింది. ఈ కళాశాల ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగులో 34వ స్థానంలో ఉంది.
వర్ధమాన్ మహావీర్ మెడికల్ కళాశాల వర్ధమాన్ మహావీర్ మెడికల్ కళాశాల ఢిల్లీలోని టాప్ మెడికల్ కళాశాలల్లో ఒకటి. ఈ కళాశాల కూడా టాప్ 7 కళాశాలల్లో ఒకటి
ఎయిమ్స్, ఢిల్లీ దేశంలోని అన్ని వైద్య కళాశాలల్లో టాప్ 1 స్థానంలో ఉంది. ఈ కళాశాలను 1956లో స్థాపించారు. వైద్య విద్య అభ్యసించాలనుకునేవారందరికీ ఎయిమ్స్ ఢిల్లీ ఒక కల.