Indra Re Release: చిరంజీవి బర్త్ డే సందర్భంగా ‘ఇంద్ర’ రీ రిలీజ్.. సాధించిన రికార్డులు,కలెక్షన్స్ ఇవే..

Indra Re Release: గత కొన్నేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో రీ రిలీజ్ ల ట్రెండ్ ఎక్కువపోయింది. ఈ నేపథ్యంలో గతంలో హిట్టైన బ్లాక్ బస్టర్ మూవీస్ లను మళ్లీ రీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ రోజుతో 22 యేళ్లు పూర్తి చేసుకున్న చిరంజీవి మెగా బ్లాక్ బస్టర్ ‘ఇంద్ర’ మూవీని ఆయన బర్త్ డే సందర్బంగా రీ రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.  ఈ సినిమా సాధించిన రికార్డుల విషయానికొస్తే..

1 /6

తెలుగు సినీ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా పాత బ్లాక్ బస్టర్ సినిమాలను  రీ రిలీజ్ చేయడం అనే ట్రెండ్ ఎక్కువైపోయింది. కొత్తలో ఈ సినిమాలను ఆదరించిన ప్రేక్షకులు ఇపుడు వాటిని పట్టించుకోవడం మానేశారు.

2 /6

 తాజాగా చిరంజీవి హీరోగా నటించిన ఇండస్ట్రీ హిట్ ‘ఇంద్ర’ మూవీని ఆగష్టు 22న రీ రిలీజ్ చేస్తున్నారు.  

3 /6

‘ఇంద్ర’ చిత్రంలో చిరంజీవి సరసన సోనాలి బింద్రే, ఆర్తి అగర్వాల్ హీరోయిన్స్ గా నటించారు. అంతేకాదు అప్పట్లో చిరంజీవి.. మృగరాజు, శ్రీ మంజునాథ, డాడీ వంటి ఫ్లాప్ మూవీస్ తో బాధ పడుతున్నాడు.‘ఇంద్ర’ సినిమా 24 జూలై 2002లో విడుదలైంది.  ఈ సినిమాను వైజయంతి మూవీస్ బ్యానర్ లో సి.అశ్వనీదత్ నిర్మాణంలో తెరకెక్కింది.  బి.గోపాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు మణిశర్మ అద్భుతమైన సంగీతం అందించారు.  

4 /6

పైగా సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి ఇండస్ట్రీ హిట్స్ తో దూకుడు మీదున్న బి.గోపాల్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడంతో ‘ఇంద్ర’ మూవీపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టే బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. చిరు కెరీర్ లో బెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.

5 /6

ఇంద్ర సినిమా 229 సెంటర్స్ లో 50 రోజులు నడిచింది. అంతేకాదు 126 కేంద్రాల్లో 100 రోజులు నడిస్తే.. 32 కేంద్రాల్లో 175 రోజుల పరుగును పూర్త చేసుకుంది. విడుదలై 22 యేళ్లు గడుస్తున్న ఈ సినిమాను టీవీల్లో చూస్తే చూసే అభిమానులున్నారు.

6 /6

ఇంద్ర సినిమా అప్పట్లోనే రూ. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంతేకాదు టోటల్ రన్ లో ఈ సినిమా రూ. 32 కోట్ల షేర్ రాబట్టింది. తెలుగులో తొలి రూ. 30 కోట్ల షేర్ మార్క్ అందుకున్న తొలి సినిమాగా ‘ఇంద్ర’ రికార్డు క్రియేట్ చేసింది. అంతేకాదు సినిమా బిజినెస్ పై 14 కోట్లకు లాభాలను నిర్మాతకు తీసుకొచ్చింది.