NTR wife Lakshmi pranathi: యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్యగా గుర్తింపు తెచ్చుకున్న లక్ష్మీ ప్రణతి దాదాపు సోషల్ మీడియాకి దూరంగా ఉంటారనే చెప్పాలి. ఇదొక్కటే కాదు ఈమెకు తెలియని ఎన్నో విషయాలను అభిమానులు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మరి లక్ష్మీ ప్రణతి గురించి తెలియని ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం..
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు ఎన్టీఆర్. ఇకపోతే ఈ రేంజ్ లో ఈయన పాపులారిటీ అందుకున్నారు కానీ ఈయన ఫ్యామిలీ మాత్రం మీడియా ముందుకు రావడం చాలా అరుదు అని చెప్పాలి.. ముఖ్యంగా ఈయన భార్య లక్ష్మీ ప్రణతి దాదాపుగా మీడియాకు దూరంగా ఉంటారనటంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే ఆమెకు సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవడానికి అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మరి ఈ కథనంలో లక్ష్మీ ప్రణతి గురించి మనకు తెలియని కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
లక్ష్మీ ప్రణతి ఎవరో కాదు ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి మనవరాలు అవుతుంది. చంద్రబాబు నాయుడు మేనకోడలు కూతురే లక్ష్మీ ప్రణతి.
లక్ష్మీ ప్రణతి ఇంటర్ అవ్వగానే అంటే మేజర్ అవ్వకముందే జూనియర్ ఎన్టీఆర్ తో పెళ్లి ఫిక్స్ చేశారట కుటుంబ సభ్యులు. కానీ ఎన్టీఆర్ మాత్రం అలా వద్దు చట్టపరంగానే పెళ్లి చేసుకుందామని చెప్పి రెండేళ్ల తర్వాత అంటే 2011 మే 5న పెళ్లి చేసుకున్నారు.
లక్ష్మీ ప్రణతి - ఎన్టీఆర్ వివాహానికి మధ్యవర్తిగా వ్యవహరించింది కూడా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అని సమాచారం.
లక్ష్మీ ప్రణతి 1992 మార్చి 18న హైదరాబాద్లో జన్మించారు. ఈమె తండ్రి నార్నె శ్రీనివాసరావు బిజినెస్ మాన్ ఒక ప్రైవేటు టీవీ ఛానల్ కూడా ఉంది. ఈమె తల్లి పేరు మల్లికా గృహిణి. ఈమెకు ఒక తమ్ముడు కూడా ఉన్నారు అతడే నార్నె నితిన్.. ఇటీవలే హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతి వివాహానికి దాదాపు రూ .10కోట్ల వరకు ఖర్చయింది. వీరి పెళ్లికి 3,000 మందికి పైగా సెలబ్రిటీలు హాజరయ్యారు. అలాగే 12 వేల మంది ఫ్యాన్స్ విచ్చేసినట్లు సమాచారం. లక్ష్మీ ప్రణతి సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటుంది. ఎన్టీఆర్ ను పెళ్లి చేసుకున్న తర్వాత భార్యగా, తల్లిగా, కోడలిగా ఇంటి బాధ్యతలు చేపట్టి ఇంటికే పరిమితమయ్యారు.