How to Boost Internet Speed: ప్రస్తుత రోజుల్లో ప్రతి ఇంట్లో ఇంటర్నెట్ సౌకర్యం తప్పకుండా ఉంటోంది. ప్రతి ఇంట్లో వైఫై రౌటర్ అమర్చి ఉంటోంది. అదే సమయంలో తరచూ ఇంటర్నెట్ స్లోగా ఉండటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. కానీ కొన్ని టిప్స్ పాటిస్తే ఇంట్లో ఇంటర్నెట్ వేగవంతం చేయవచ్చు. మీ వైఫై రౌటర్ స్పీడ్ పెంచవచ్చు.
వైఫై రౌటర్ ఎప్పుడూ ఇంట్లో మధ్యలో ఉంచాలి. అది కూడా ఎత్తైన ప్రదేశంలో అమర్చాలి. తద్వారా ఇళ్లంతా సమానంగా వైఫై అందుతుంది.
వైఫై రౌటర్ కోసం ఎప్పుడూ బిజీ తక్కువ ఉండే ఛానెల్ ఎంపిక చేసుకోవాలి. వైఫై ఎనలైజర్ యాప్ సహాయంతో అందుబాటులో ఏయే ఛానెల్స్ ఉన్నాయో చూడవచ్చు.
2.4 గిగా హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్ ఉపయోగిస్తుంటే..5 గిగా హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్కు స్విచ్ కావల్సి ఉంటుంది.
వైఫై రౌటర్ కోసం లేటెస్ట్ Firmware ఇన్స్టాల్ చేసుకోవాలి. దీనివల్ల వైఫై సురక్షితంగా ఉంటుంది.
ముందుగా వైఫై రౌటర్ను రీస్టార్ట్ చేయాలి. దీనివల్ల వైఫై రౌటర్ క్రాష్ శుభ్రమౌతుంది. రౌటర్ వేగం పెంచవచ్చు. అంతేకాకుండా వైఫై ఎక్స్టెండర్ లేదా పవర్ లైన్ అడాప్టర్ సహాయంతో వేగం పెంచవచ్చు.