iPhone 16 Pro Max: ఐఫోన్‌ 16 Pro Max కెమెరాలో వచ్చే భారీ మార్పులు ఇవే!

iPhone 16 Pro Max: త్వరలోనే మార్కెట్‌లోకి అందుబాటులోకి రాబోయే iPhone 16 Pro Max స్మార్ట్‌ఫోన్‌ అద్భుతమైన ఫీచర్స్‌తో రాబోతోంది. ఇందులో కెమెరాలో భారీ మార్పులు ఉండబోతున్నాయి. ఆ మార్పులు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 


iPhone 16 Pro Max: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ యాపిల్‌ త్వరలోనే ఐఫోన్‌ 16 సిరీస్‌ను ప్రారంభించబోతోంది. అయితే విడుదలకు ముందే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌ సోషల్ మీడియాలో లీక్‌ అయ్యాయి. ఈ సిరీస్‌లో టాప్‌ ఎండ్‌ మోడల్‌ iPhone 16 Pro Max స్మార్ట్‌ఫోన్‌లో ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ అందుబాటులోకి రాబోతున్నాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన లీక్‌ అయిన వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి. 
 

1 /6

ఈ iPhone 16 సిరీస్‌లోని అత్యంత శక్తివంతమైన మోడల్ iPhone 16 Pro Max స్మార్ట్‌ఫోన్‌ ప్రీమియం 48MP ప్రైమరీ కెమెరాతో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు అదనంగా  48MP అల్ట్రా-వైడ్ కెమెరా సెన్సార్‌ను కూడా కలిగి ఉంటుంది.

2 /6

యాపిల్‌ కంపెనీ ఐఫోన్‌ 16 ప్రో మాక్స్‌ కెమెరాలో అనేక కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. చిత్రాల నాణ్యత కోసం అద్భుతమైన  కెమెరా అప్‌గ్రేడ్‌లను అందించే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం.   

3 /6

యాపిల్‌ త్వరలోనే అందుబాటులోకి తీసుకు రాబోయే 16 ప్రో మాక్స్‌లో ఇంతక ముందు లాంచ్‌ చేసిన 15 ప్రో మాక్స్‌ కెమెరా కంటే 12-మెగాపిక్సెల్ సెన్సార్ అదనంగా రాబోతోంది. దీంతో పాటు కొత్త ఫీచర్స్‌ కూడా రాబోతున్నాయి.

4 /6

ఈ ఐఫోన్‌ 16 ప్రో మాక్స్‌ స్మార్ట్‌ఫోన్‌లో అల్ట్రా-వైడ్ కెమెరాను కూడా కంపెనీ అప్‌గ్రేడ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇది పెద్ద ఫ్రేమ్‌లో ఎక్కువ సబ్జెక్ట్‌లను క్యాప్చర్ చేయడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది.   

5 /6

ఐఫోన్‌ 16 ప్రో మాక్స్‌ మొబైల్‌ 5x టెలిఫోటో కెమెరాతో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు అద్భుతమైన జూమ్‌ సెటప్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. 

6 /6

ఈ స్మార్ట్‌ఫోన్‌ కెమెరాలో భాగంగా LIDAR స్కానర్ ఫీచర్‌ను కూడా అందించబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు సెన్సార్-షిఫ్ట్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) ఫీచర్స్‌ కూడా ఉండబోతోంది.