IRCTC Tour: ఏడు జ్యోతిర్లింగాలను ఒకే ప్యాకేజీతో దర్శించుకునే అద్భుత అవకాశం.. వివరాలు

IRCTC Sapta Jyotirlinga Tour: హిందూ మతంలో జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ముఖ్యంగా శివుని పరమభక్తులు జీవితంలో ఒక్కసారైన ఈ జ్యోతిర్లింగాల దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. 

1 /7

ఒకవేళ ఒకేసారి ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకునే అవకాశం ఉంటే.. అవును అలాంటి టూర్‌ ప్యాకేజీ మీ ముందుకు తీసుకువస్తుంది ఐఆర్‌సీటీసీ ఆ వివరాలు తెలుసుకుందాం.  

2 /7

ఒకేసారి ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకునే అవకాశం కల్పిస్తోంది ఐఆర్‌సీటీసీ సప్త (07) జ్యోతిర్లింగ దర్శన యాత్ర పేరుతో భారత్‌ గౌరవ్‌ టూరిస్టు ట్రైన్‌2 ఏసీ, 3 ఏసీ, ఎస్‌ఎల్‌ క్లాసెస్‌ అందుబాటులో ఉన్నాయి.   

3 /7

ఈ యాత్ర ద్వారా ఉజ్జయిని (మహాకాళేశ్వర, ఒంకారేశ్వర్‌), ద్వారకా (నాగేశ్వర్‌), సోమనాథ్‌ (సోమనాథ్‌ టెంపుల్‌) పూణె భీమశంకర్‌, నాశిక్‌ (త్రయంబకేశ్వర్‌), ఔరంగాబాద్‌ (గ్రిష్నేశ్వర్) దర్శంచుకోవచ్చు.  

4 /7

సప్త జ్యోతిర్లింగా టూర్‌ ప్యాకేజీ 12 రోజుల టూర్‌. 11 రాత్రులు/12 రోజులు. ఈ టూర్‌ 2024 ఆగస్టు 17న ప్రారంభమవుతుంది. ఈ ట్రైన్‌లో అందుబాటులో ఉన్న సీట్లు 716 (ఎస్‌ఎల్‌:460, 3AC:206, 2AC: 50) అందుబాటులో ఉన్నాయి.  

5 /7

ఈ టూర్‌ ప్యాకేజీ విజయవాడలో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మధిర, ఖమ్మం, డోర్నకల్‌ జంక్షన్‌, మహబూబాబాద్‌, వరంగల్‌, ఖాజీపేట, జనగాం, భువనగిరి, సికింద్రాబాద్‌, కామరెడ్డి, నిజామాబాద్‌, ధర్మా బాద్‌, ముడ్కేడ్‌, నాందేడ్‌, పూర్నా గుండా టూర్‌ వెళ్తుంది.    

6 /7

సప్త టూర్‌ ప్యాకేజిలో ఎకానమీలో ప్రయాణిస్తే ఇద్దరు లేదా ముగ్గురి కి రూ. 20590 ఒక్కరికీ వర్తిస్తుంది. పిల్లలు 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉన్నవారికి రూ. 19,255. స్టాండర్డ్‌ కేటగరీ అయితే, ఇద్దరు లేదా ముగ్గురు కలిసి ప్రయాణిస్తే రూ. 33,015, పిల్లలకు రూ.31,440 చెల్లించాలి. అదే కంఫోర్ట్‌ కేటగిరీ అయితే, ఇద్దరు లేదా ముగ్గురు ప్రయాణిస్తే ఒక్కక్కరికీ రూ. 43,355, పిల్లలకు రూ. 41,465 చెల్లించాలి.  

7 /7

ఈ ప్యాకేజిలో ఫుడ్‌ మార్నింగ్‌ టీ, బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్నం భోజనం, డిన్నర్‌ (వెజ్‌) తోపాటు ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ కూడా ప్రయాణీకులకు వర్తిస్తుంది. ట్రైన్‌లో సెక్యూరిటీ కూడా ఉంటుంది.