Janhvi Kapoor: అమరన్ మూవీ.. నేచురల్ బ్యూటీపై షాకింగ్ కామెంట్స్ చేసిన జాన్వీకపూర్.. ఏమందంటే..?

Janhni Kapoor on sai Pallavi: బాలీవుడ్ నటి జాన్వీకపూర్ తాజాగా అమరన్ మూవీ చూసినట్లు తెలుస్తొంది. ఈక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్గా మారాయి.
 

1 /6

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించిన అమరన్ మూవీ బ్లాక్ బాస్టర్ హీట్ ను సాధించిన విషయం తెలిసిందే.  దీపావళి కానుకగా ఈ మూవీ అభిమానుల ముందుకు వచ్చింది.  

2 /6

2014 లో పుల్వామా ఘటనలో అసువులు బాసిన మేజర్ ముకుంద్ వరద రాజన్ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ  మూవీలో మేజర్ ముకుంద్ వరద రాజన్ పాత్రలో.. కార్తీకేయన్, ఇందు రెబెకా వర్ఘీస్ పాత్రలో.. సాయిపల్లవి నటించారు.  

3 /6

ఈ మూవీ నేపథ్యంలో అనేక వివాదాలు తెరమీదకు వచ్చాయి. అదే విధంగా గతంలో సాయి పల్లవి ఇండియన్ ఆర్మీని పాక్ వారితో పోల్చిమాట్లాడారని.. ఆమె ఇండియన్ ఆర్మీకి సారీ చెప్పాలని కూడా డిమాండ్ లు వెల్లువెత్తాయి.  

4 /6

ఈ నేపథ్యంలో అమరన్ సినిమా మాత్రం సాయిపల్లవి కెరిర్ లో ఒక బిగ్గెస్ట్ హిట్ అని చెప్పుకొవచ్చు. అయితే.. ప్రస్తుతం ఈ సినిమాను తాజాగా.. శ్రీదేవీ కూతురు జాన్వీకపూర్ చూసినట్లు తెలుస్తొంది.  

5 /6

జాన్వీకపూర్ ఈ సినిమా గురించి ఆసక్తికంగా మాట్లాడారు. ఈ మూవీ నా లైఫ్ లో చూసిన బెస్ట్ సినిమాల్లో ఒకటని చెప్పుకొచ్చారు. ఈ మూవీ చూశాక.. చాలా ఎమోషనల్ అయ్యాయన్నారు. 

6 /6

ఒక రకంగా చెప్పాలంటే.. ఈ మూవీ చూడటం ఆలస్యమైందని కూడా జాన్వీకపూర్ అన్నట్లు  తెలుస్తొంది. ఈమూవీలోని ప్రతి సన్ని వేశం కూడా.. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా ఉందని కూడా చెప్పారు. ఒక మంచి సినిమాతో ఈ ఏడాదిని ముగించానని కూడా జాన్వీకపూర్ చెప్పినట్లు తెలుస్తొంది.