Alia bhatt rare disease: ఆలియా భట్ ఇటీవల కొన్నేళ్లుగా తను ఎదుర్కొంటున్న సమస్యలను పబ్లిక్ గా చెప్పుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఆమె ఫ్యాన్స్ మాత్రం ఆందోళనకు గురైనట్లు తెలుస్తోంది.
జిగ్రా మూవీ ప్రస్తుతం బాక్సాఫీస్ మీద దూసుకుపోతుంది. ఈ సినిమా ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే.. జిగ్రా మూవీ యాకన్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. దీనిలో ఆలియా భట్ కీలక పాత్ర పోషించారు.
ఈ మూవీ అక్టోబర్ 11న ఆడియన్స్ ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ మూవీని వాసన్ దర్శకత్వం వహించారు. అదే విధంగా తన తమ్ముడి కోసం ఒక అక్క పడే తపన ఏ విదంగా ఉంటుందో ఈ సిననిమాలో చూపించారు.
ఇదిలా ఉండగా.. జిగ్రా మూవీ ఆడియన్స్ కు నచ్చలేదని, కేవలం రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారని టీ సిరిస్ నిర్మాత భూషన్ కుమార్ సతీమణి దివ్యా ఖోస్లా సంచలనంగా మాట్లాడారు. చాలా మంది ఫెక్ పబ్లిసిటీని ఇస్తున్నారన్నారు. దీంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు మూవీ రంగంలో పెనుదుమారంగా మారాయి.
అయితే.. జీగ్రా నటి ఆలియాభట్ ఇటీవల తాను అరుదైన సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పారు. కరీనా కపూర్ తో నిర్వహించిన ఒక పాడ్ కాస్ట్ లో ఈ విషయాల్ని ఆలియా భట్ పంచుకున్నారు. ఏ విషయాన్ని అయిన ఎక్కువగా ఆలోచిస్తున్నానని, ఆంగ్జైటీ ఎక్కువగా అయ్యిందన్నారు.
సాధారణంగా ప్రతి ఒక్కరిలో ఆంగ్జైటీ ఉండటం కామన్ అని... కానీ తనకు మాత్రం.. అది ప్రతి విషయంలోను ఉంటుందని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తన భర్త రణ్ బీర్ కపూర్ తనకు ఫుల్ సపోర్ట్ గా ఉంటున్నారన్నారు. మరోవైపు ఆలియా ప్రస్తుతం ఆల్ఫాలో నటిస్తుంది.
ఇటీవల జిగ్రా మూవీ ప్రీరీలీజ్ ఈవెంట్ హైదరబాద్ లో జరిగింది. దీనికి సమంతా స్పెషల్ గెస్ట్ గా హజరయ్యారు. అదే విధంగా.. రాజమౌళీ, దగ్గుబాటి రాణా సైతం హజరయ్యారు. ఈ మూవీ విడుదలయ్యాక.. సినిమాపై మహేష్ బాబు రెస్పాండ్ అయి పోస్ట్ సైతం చేశారు. దీంతో ఈ మూవీపై ఇంకా హైప్ క్రియేట్ అయ్యిందని చెప్పుకొవచ్చు.