Devara: నైజాంలో దేవర మరో బెంచ్ మార్క్.. ఎన్టీఆర్ మాస్ రచ్చ..

Devara Nizam: ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘దేవర’. గత నెల లాస్ట్ వీక్ లో విడుదలైన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ తో పలు రికార్డులను కొల్లగొడుతుంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో కీలకమైన  తెలంగాణలో ఏరియాలో ఈ సినిమా రికార్డు బ్రేక్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది.

1 /6

Devara Nizam Collections : తెలుగు సినిమా బాక్సాఫీస్ కు నైజాం (తెలంగాణ ) అతిపెద్ద ఏరియా. మిగతా ఆంధ్ర ప్రదేశ్, సీడెడ్ పోలిస్తే.. హైదరాబాద్ నగరంలో మల్టీప్లెక్స్ పెరగడం, టికెట్ రేట్స్ పెరుగుదలతో పాటు ఇక్కడ అన్ని ఏరియాల వాళ్లు ఉండటంతో ఇక్కడ పెద్ద హీరోల సినిమాలకు హిట్ టాక్ వస్తే బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ అదే రేంజ్ లో వస్తున్నాయి.

2 /6

తాజాగా ఇక్కడ కొన్ని సినిమాలు రూ. 50 కోట్ల షేర్ మార్క్ ను సొంతం చేసుకోవడం మామలు విషయం కాదు. 2017లో తొలిసారి.. తక్కువ టికెట్ రేట్స్ తో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి 2’ సినిమా ఇక్కడ ఫస్ట్ టైమ్ రూ. 50 కోట్ల మార్క్ షేర్ అందుకొని సంచలనం రేపింది. 

3 /6

ఆ తర్వాత 5 యేళ్లకు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ‘ఆర్ఆర్ఆర్’ నైజాంలో ఏకంగా రూ. 50 కోట్లకు డబుల్ అంటే రూ. 100 కోట్లకు పైగా షేర్ రాబట్టి సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత తెలంగాణ గడ్డపై కేవలం 3 చిత్రాలు మాత్రమే రూ. 5 కోట్ల మార్క్ ను క్రాస్ చేసాయి.

4 /6

గతేడాది చివర్లో విడుదలైన రెబల్ స్టార్ ప్రభాస్... సలార్ మూవీ (Salaar) మూవీతో పాటు రీసెంట్ గా వచ్చిన కల్కి 2898 AD(Kalki 2898 AD) సినిమాలు ఇక్కడ రూ. 50 కోట్ల షేర్ మార్క్ ను క్రాస్ చేసాయి. తాజాగా ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘దేవర పార్ట్ -1’ ఇక్కడ రూ. 50 కోట్ల మార్క్ దాటి రూ. 55 కోట్ల షేర్ మార్కెట్ ను అందుకొని స్టడీగా కొనసాగుతుంది.

5 /6

మొత్తంగా తెలంగాణ గడ్డపై మూడు సినిమాలు బాహుబలి, సలార్, కల్కి సినిమాలో మూడు సార్లు రచ్చ లేపాడు ప్రభాస్. ఆ తర్వాత ఎన్టీఆర్ ..ఆర్ఆర్ఆర్.. తాజాగా ‘దేవర’తో రెండు సార్లు రూ. 50 కోట్ల షేర్ మార్క్ అందుకున్న హీరోగా నిలిచాడు. రామ్ చరణ్ కు ఒక్కసారి ఈ మార్క్ ఆర్ఆర్ఆర్ తో ఎన్టీఆర్ తో అందుకున్నాడు.

6 /6

రాబోయే రోజుల్లో బడా స్టార్ హీరోల సినిమాలు విడుదల కావాల్సి ఉంది. ఇందులో ఎంతో మంది స్టార్ హీరోలు నైజాంలో కీలకమైన రూ. 50 కోట్ల షేర్ మార్క్ అందుకునే హీరో ఎవరనేది చూడాలి.