Jupiter Transit: హిందూ జ్యోతిష్యం ప్రకారం గ్రహాల్లో గురుడు శక్తివంతమైన గ్రహం. గురువు ఎలా కదిలినా ఏ మార్గంలో పయనించినా ఇతర రాశులపై గణనీయమైన ప్రభావం ఉంటుంది. అదే విధంగా గురుడు వక్రమార్గం కారణంగా ఈ రాశులపై విజయం వర్షించనుంది.
జ్యోతిష్యం ప్రకారం గురు గ్రహం గోచారానికి విశేష ప్రాధాన్యత, మహత్యం ఉన్నాయి. గురువు స్థానం అనుకూలంగా ఉంటే కొన్ని రాశులకు అత్యంత అదృష్టంగా మారనుంది. జీవితంలో ఎన్నడూలేనంతగా సుఖ సంతోషాలు పొందుతారు. గురు గ్రహం అక్టోబర్ 9న వృషభ రాశిలో ప్రవేశించాడు. ఫిబ్రవరి 5 వరకూ అక్కడే ఉంటాడు. ఈ సందర్భంగా ఏయే రాశులకు దశ మారనుందో తెలుసుకుందాం.
సాధారణంగా ఏదైనా గ్రహం రాశి మారినప్పుడు ఆ ప్రభావం అన్ని రాశులపై పడుతుంది. కొందరికి అనుకూలంగా ఉంటే, మరి కొందరికి ప్రతికూలం కావచ్చు. గురువు వక్రమార్గం కొన్ని రాశులపై కనకవర్షం కురిపించనుంది. జీవితంలో ఎన్నడూ లేనంత ఆనందాన్ని పొందుతారు. ప్రతి రంగంలో విజయం సాధిస్తారు.
అక్టోబర్ 9వ తేదీన గురు గ్రహం వృషభ రాశిలో ప్రవేశించాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 5 వరకూ అక్కడే సంచరిస్తాడు. గురు గ్రహం గోచారం జ్యోతిష్యంలో అతి పెద్ద ఘటనగా భావించాల్సి వస్తోంది.
హిందూ జ్యోతిష్యం ప్రకారం ఒక్కో గ్రహానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. అదే విధంగా గురు గ్రహాన్ని అత్యంత శుభసూచకంగా పరిగణిస్తారు. జీవితంలో పెళ్లి, సంతోషం, సుఖ సంతోషాలు, డబ్బు ఇలా చాలా అంశాలకు గురువే కారకం కావడంతో గురు గ్రహం గోచారం అత్యంత కీలకం కానుంది.
మేషం గురువు వక్రమార్గం కారణంగా మేష రాశి జాతకులకు అత్యంత లాభదాయకం కానుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగులు పదోన్నతి పొందుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు సిద్ధిస్తాయి. ఊహించని సంపద కలిసొస్తుంది. ఎందులో అడుగెట్టినా లాభం కలుగుతుంది. కొత్త వ్యాపారాలకు అనువైన సమయం.
కుంభం గురు గ్రహం వక్రమార్గంలో సంచారం కారణంగా ఈ రాశివారికి ధన ప్రవాహం పెరుగుతుంది. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. జీత భత్యాలు భారీగా పెరుగుతాయి. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఆకశ్మిక ధనలాభం కలుగుతుంది.
ధనుస్సు గురువు వక్రమార్గ సంచారం కారణంగా ధనస్సు రాశి జాతకులకు ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి. ఉద్యోగులకు ఆదాయం పెరుగుతుంది. వ్యాపారులు అమితమైన లాభాలు ఆర్జిస్తారు. విదేశీయానం ఉంటుంది. దూర ప్రయాణాలు చేసినా ఆర్ధికంగా కలిసొస్తుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు.
సింహ రాశి సింహ రాశి జాతకులకు గురుడు వక్రమార్గం కారణంగా గోల్డెన్ డేస్ ప్రారంభమౌతాయి. ఈ రాశివారికి ఊహించని విధంగా పూర్వీకుల ఆస్థి లభిస్తుంది. ఎప్పట్నించో పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారం అనుకూలిస్తుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు అనువైన సమయం. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఉద్యోగులకు పదోన్నతి లేదా కోరుకున్న కొత్త ఉద్యోగాలు లభిస్తాయి. ఈ రాశివారికి పట్టిందల్లా బంగారమౌతుంది.
కర్కాటకం గురు గ్రహం వృషభ రాశిలో వక్రమార్గంలో సంచరించడం వల్ల కర్కాటక రాశి జాతకులకు అత్యంత లాభదాయకం కానుంది. ఉద్యోగులు, వ్యాపారులకు చాలా అనువైన సమయం. ఆర్ధికంగా పటిష్టమైన స్థితిలో ఉంటారు. ఏ రంగంలో అడుగెట్టినా లాభాలు ఆర్జించగలరు. ఇంట్లో కుటుంబసభ్యులతో ఎక్కువ సమయం గడుపుతారు. అన్ని విధాలుగా బాగుంటుంది.
మిథునం గురు గ్రహం వక్రమార్గంలో ఉండటం వల్ల మిధున రాశి జాతకులకు మహర్దశ పట్టనుంది. ఈరాశివారికి ఆర్ధికంగా లాభం కలుగుతుంది. చాలాకాలంగా పెండింగులో ఉన్న డబ్బులు చేతికి అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతితో పాటు వేతనం పెరుగుతుంది. వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు. ఇంట్లో శుభ కార్యాలు జరగవచ్చు. పెట్టుబడులకు అనువైన సమయం. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం.