Karthika Purnima 2024: కార్తీక పౌర్ణమి.. ఈ ఒక్కపనిచేస్తే ఏడాదంతా డబ్బులకు ఏ మాత్రం లోటు ఉండదు..

Karthika masam 2024: కార్తీక మాసంకు చాలా ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఈ నెల పాటు చాలా మంది ప్రత్యేకమైన వ్రతాలు, పూజలు చేస్తుంటారు.ఈ నెలలో దీపారాధన, దానాలు, నదీ స్నానం, ఆలయల సందర్శన మొదలైన వాటిని ఎక్కువగా ఆచరిస్తారు.
 

1 /6

కార్తీక మాసం నెల రోజుల పాటు శివ, కేశవులను ఎంతో భక్తితో కొలుస్తారు. అంతే కాకుండా.. ఈ మాసంలో మనం ఏ పనిచేసిన అది డబుల్ మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ నెల రోజుల పాటు చేసుకున్న వాడికి చేసుకున్నంత పుణ్యంగా చెప్తుంటారు.

2 /6

అయితే.. కార్తీకంలో దశమి నుంచి పౌర్ణమి తిథి వరకు ఎంతో మంచి రోజులని చెబుతుంటారు. కార్తీక పౌర్ణమి అన్నింటికి మించి విశేషమైన ఫలితాలను ఇస్తుంది. కార్తీక మాసంలో చాలా మంది నెల రోజుల పూజలు, వ్రతాలు ఆచరిస్తారు

3 /6

నెల రోజుల పాటు పూజలు, స్నానాలు చేయడం కుదరని వారు.. కనీసం కార్తీక పౌర్ణమి రోజున సూర్యొదయం కంటే ముందు నిద్రలేచి, స్నానాదులు పూర్తిచేసుకుని దీపారాధన చేయాలి. ఉసిరి పండు మీద దీపం, తులసీ చెట్టు దగ్గర దీపం పెడితే మరింత పుణ్యం వస్తుంది.  

4 /6

ముఖ్యంగా కార్తీక మాసంలో స్తంభ దీపంఎంతో ప్రాముఖ్యత కల్గి ఉంటుంది. ఆలయాలకు ధ్వజ స్తంభం మీద కొత్త ఆంజనేయ స్వామి జెండాను ఎగురవేయాలి. దీని వల్ల మనం చేసుకున్న పాపాలు దుమ్ములా ఎగిరిపోతాయి.

5 /6

కార్తీక పౌర్ణమి ఒక్కరోజైన కనీసం పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరలతో శివ, కేశవుల్ని అభిషేకం చేస్తే ఏడాదంత కూడా అలాంటి వారి ఇంట్లో డబ్బులకు అస్సలు కొదువ ఉండదని పండితులు చెబుతుంటారు.  

6 /6

అదే విధంగా పౌర్ణమి రోజున యోగ్యుడైన పండితుడిని ఇంటికి పిలిచి సాలగ్రామలను దానంగా ఇస్తే .. అలాంటి వారి ఇంట సంపద తాండవం చేస్తుందని చెబుతుంటారు. మీ ఇంట్లో పూజలో ఉన్నది కాకుండా.. కొత్తది కొనుక్కొని వచ్చి దానంగా ఇవ్వాలని పండితులు సూచిస్తుంటారు.