Lord Shanidev: అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో పూర్తవ్వడానికి వచ్చిందని చెప్పుకొవచ్చు. ఈ నేపథ్యంలో రేపు అంటే.. శనివారం రోజున అమావాస్య తిథి (నవంబరు 30న) రానుంది. ఈ రోజున శనీశ్వరుడు కొన్ని రాశులకు మంచి చేయబోతున్నాడు.
సాధారణంగా కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైంది. అయితే.. ప్రస్తుతం కార్తీక మాసంలో అమావాస్య రేపు అంటే.. నవంబరు 30న రానుంది. ఈరోజున శనివారం కూడా కావడం ఎంతో గొప్పదైన విషయమని కూడా చెప్పుకొవచ్చు.
ఈనేపథ్యంలో పండితులు ప్రకారం.. అమావాస్య అది కూడా శనీవారం రావడంను ఎంతో అరుదైనదిగా చెప్తుంటారు. ఈ రెండు కలయిక జరిగిన రోజు మనం చేసే పూజలు, జపాలు, తపాలు వెయ్యి రెట్లు మంచి ఫలితాలను ఇస్తాయంట.
ఈ సారి శనీశ్వరుడు అమావాస్య ప్రభావం కారణంగా కొత్త ఆంగ్ల ఏడాది కంటే ముందే కొన్ని రాశుల వారిని కింగ్ మేకర్లను చేయబోతున్నాడు. ముఖ్యంగా శనీశ్వరుడు అంటే.. అందరుఏదో పీడించేంది భావిస్తుంటారు. కానీ ఆయన చల్లని చూపు గురించి చాలా మందికి తెలియదు. ఆయన ఒక చూపుతోనే.. రాజును భికారీగాను.. భికారీని రాజుగాను చేయగల సమర్థడు. ఆయన మనం చేసుకున్న కర్మలను బట్టి మాత్రమే ఫలితాలను ఇస్తుంటాడని జ్యోతిష్యులు చెబుతుంటారు.
కార్తీక అమావాస్య ప్రభావం వల్ల.. శనీశ్వరుడు.. ముఖ్యంగా.. తుల రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు కలిగే అవకాశా ఉన్నాయంట. అదే విధంగా విదేశీయానానికి కూడా శుభసమయం అని చెప్పుకొవచ్చు. విందువు వినోదాల్లో పాల్గొంటారు.
వృషభ రాశివారికి ఈ సమయంలో మంచి అమ్మాయితో పెళ్లి సంబంధం కుదురుతుంది. కోర్టు కేసుల్లో విజయాలు సాధిస్తారు. సర్కారు కొలువు వచ్చి.. సొంతింటి కల సాకారం అవుతుంది. దైవదర్శనాలు చేసుకుంటారు.
కర్కాటక రాశి వారు.. వీరు ముఖ్యంగా సోదరులో ఉన్న వివాదాలు సమసిపోతాయి. అత్తింటి నుంచి ఆస్తులు మీ సొంతమౌతాయి. రాజకీయాల్లో రాణిస్తారు. పలుకుబడి గల వారితో పనిచయాలు ఏర్పడతాయి. మీ వల్ల చాలా మంది లాభపడతారు. ఈ విధంగా ఈరాశులకు మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.