Karva Chauth 2020 pics: కర్వా చౌత్ ప్రత్యేకతను చూపించిన బాలీవుడ్ చిత్రాలు.. ఫోటోలు

  • Nov 05, 2020, 01:41 AM IST
1 /5

కర్వా చౌత్ అంటే ముందుగా అందరికీ గుర్తుకొచ్చేది బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే చిత్రంలోని కర్వా చౌత్ పండగ సన్నివేశం. కర్వా చౌత్ పర్వదినం ఆచారం ప్రకారం పెళ్లి అయిన మహిళలు తమ భర్త కోసం, పెళ్లి చేసుకోబోయే అమ్మాయిల తమ కాబోయే యోగక్షేమాలు కోరుతూ చేసుకునే పండగ ఇది. కర్వా చౌత్ ఆచారం ప్రకారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాత భర్త చేతుల మీదుగా ఉపవాస దీక్ష విడుస్తారు.  ఈ సినిమాలో హీరోయిన్ సిమ్రాన్ ( కాజోల్ ) రాజ్ ( షారుఖ్ ఖాన్)ని ప్రేమిస్తుంది, కానీ అప్పటికే ఆమెకు ‌కుల్దీప్ అనే యువకుడితో ఎంగేజ్‌మెంట్ అయిపోతుంది. అటువంటి సందర్భంలో కర్వా చౌత్ నాడు రాజ్ కోసం వ్రతం పాటించి ఉపవాసం ఉన్న సిమ్రన్ అతడి చేతుల మీదుగానే ఉపవాసం విరమించడం కోసం కళ్లుతిరిగి పడిపోయినట్టు యాక్టింగ్ చేస్తుంది. దీంతో రాజ్ హడావుడిగా నీళ్లు తెచ్చిస్తాడు. అలా కుల్దీప్‌కి బదులుగా రాజ్ చేతుల మీదుగా సిమ్రన్ ఉపవాస దీక్ష విడిచే ఈ సీన్ ఆడియెన్స్ అందరిీక బాగా కనెక్ట్ అయింది. ఇప్పటికీ కర్వా చౌత్ అంటే ఈ సినిమా చూసిన వాళ్లందరికీ ముందుగా గుర్తుకొచ్చే సీన్ ఇదే. 

2 /5

కభీ ఖుషీ ఘమ్ చిత్రంలో కర్వా చౌత్ పర్వదినం సన్నివేశంలో కాజోల్, షారుఖ్ ఖాన్, జయాబచ్చన్

3 /5

బాఘ్‌బన్ సినిమాలో బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్ బచ్చన్, డ్రీమా గాళ్ హేమా మాలిని

4 /5

హమ్ దిల్ దే చుకే సనం సినిమాలో సల్మాన్ ఖాన్, ఐశ్వర్వా రాయ్ మధ్య కర్వా చౌత్ సన్నివేశం

5 /5

ఇష్క్ విష్క్ చిత్రంలో కర్వా చౌత్ పండగ సన్నివేశంలో షాహీద్ కపూర్, అమృత