Samantha ruth prabhu: కీర్తిసురేష్ ప్రస్తుతం చాలా ఎమోషనల్ గా ఉన్నారని ప్రచారం జరుగుతుంది. ఆమె తాజాగా...నటించిన బేబీ జాన్ మూవీ అంత హిట్ ను సాధించలేకపోయిందని బాధపడుతున్నారంట.
కీర్తిసురేష్ ఇటీవలే తన చిన్ననాటి ఫ్రెండ్ ఆంటోనీ తట్టీల్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈక్రమంలో పెళ్లితర్వాత ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా.. ఆమెతన బాలీవుడ్ సినిమా బేబీ జాన్ ప్రమోషన్స్ లలో పాల్గొన్నారు.
అయితే.. కీర్తిసురేష్ మాత్రం.. తనను ఈ సినిమాకు సమంత ప్రపోజ్ చేశారని ఇటీవల చెప్పారు. తమిళంలో తేరీ మూవీకి.. బేబీ జాన్ రిమేక్.. ఈ సినిమా హిట్‌తో బాలీవుడ్ లో పాగావేయాలని ఈ భామ భావించిందంట.
కానీ అనూహ్యంగా బేబీజాన్ మూవీ ఫ్లాప్ అవ్వడంతో పాటు.. హింది భాష వల్ల కాంట్రవర్సీగా మారిందంట. అంతే కాకుండా..ఈమూవీ బడ్జెట్ లో కనీసం 25 శాతం వసూళ్లను కూడా ఈ మూవీ రాబట్టలేకపోయిందంట.
ఈ క్రమంలో ఈ మూవీ కన్న ముందు.. కీర్తి సురేష్ అజయ్ దేవ్ గణ్ లో.. మైదాన్ సినిమాలో నటించాలని ప్లాన్ చేసిందంట. కానీ కీర్తిసురేష్ కు బిజీగా వల్ల.. ఆ మూవీ నుంచి తప్పుకుందంట. ఆ తర్వాత సమంత వల్ల బేబీ జాన్ లో అవకాశం వచ్చిందంట. అయితే.. అజయ్ దేవ్ గణ్ మూవీ.. మైదాన్ హిట్ ను సొంతం చేసుకుందంట..
ఇప్పుడు ఒక వైపు బేబీ జాన్ ఫ్లాప్ కావడం, మరొవైపు కాంట్రవర్సీ లతో కీర్తి సురేష్ చాలా ఒత్తిడిగా ఉంటున్నారంట. అసలు.. సమంత.. తన పేరును ఎందుకు చెప్పిందో అని మండిపడుతున్నారంట. ఈ క్రమంలో బాలీవుడ్ లో తన ఫస్ట్ సినిమా ఫ్లాప్ కావడంతో.. తన లైఫ్ ఇక్కడితో ఆగిపోతుందా.. అంటూ కూడా ఎమోషనల్ అయినట్లు ప్రచారం జరుగుతుంది.
మొత్తానికి సమంత ఘనకార్యంవల్ల తన కెరీర్ అంతా నాశనమైందని కూడా మహనటి ఆవేదన చెందుతుందంట. మరోవైపు కీర్తిసురేష్ కు పెళ్లి అచ్చిరాలేదని కూడా పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. మొత్తానికి ఈ రూమర్ తో కీర్తిసురేష్ వార్తలలో నిలిచారని చెప్పుకొవచ్చు.