Election Ink Unfaded: ఆందోళనలో ఓటరు.. 9 ఏళ్లుగా చెరిగిపోని ఎన్నికల సిరాగుర్తు..

Kerala Woman Usha: కేరళకు చెందిన మహిళ తొమ్మిది ఏళ్లుగా సిరాగుర్తు పోవట్లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఎన్నిసార్లు చెప్పిన, కూడా అధికారులు దీనిపై సరిగ్గా స్పందించట్లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఈ ఘటన మరోమారు ఎన్నికల వేళ వార్తలలో నిలిచింది.
 

  • Apr 26, 2024, 07:39 AM IST
1 /7

నార్మల్ గా  ఎన్నికలు జరిగినప్పుడు మనం అందరం ఓటు హక్కును వినియోగించుకుంటాం. అది మనకు రాజ్యంగం కల్పించిన హక్కు.  ఓటు హక్కు అనే ఆయుధంతో మనకు మంచి చేసే పార్టీని, నేతలను ఎంపిక చేసి అసెంబ్లీకి, పార్లమెంట్ కు పంపేలా ఈ ఆయుధంను రాజ్యంగం మనకు ఇచ్చింది.

2 /7

అందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎల్లప్పుడు కూడా ఓటుహక్కు ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేస్తు ఉంటుంది. ప్రజల్లో ఎల్లప్పుడుకూడా అవగాహాన కల్పిస్తుంది. కానీ ఇప్పటికి కొందరు మాత్రం ఓటింగ్ డేను హలీడేగా భావిస్తారు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించరు. కానీ దీనికి భిన్నంగా కొందరు శతాధిక వయస్సు ఉన్న వాళ్లు తమ ఓటుహక్కు ఉపయోగించుకుని యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.

3 /7

ఇదిలా ఉండగా.. కేరళకు చెందిన షోరన్ పూర్ గురువాయురప్పన్ కు చెందిన ఉషా (62) అనే మహిళ ఒక వింత ఘటనను ఎదుర్కొంటుంది. ఆమె 2016 లో ఓటు వేసింది. అప్పుడు ఆమె వేలికి సిరాచుక్కను అధికారులు పెట్టారు. నార్మల్ గా సిరాచుక్క వారం లేదా పదిరోజుల్లో పూర్తిగా మాసిపోతుంది. కానీ ఈమెకు మాత్రం 9 ఏళ్లు గడుస్తున్న కూడా సిరాచుక్క పోవడం లేదు.

4 /7

దీంతో సదరు మహిళ.. 2019 లోక్‌  సభ, 2021 అసెంబ్లీ ఎన్నికలలో ఓటుహక్కును వినియోగించుకోవడానికి వెళ్లింది. కానీ ఎన్నికల అధికారులు ఆమె చేతివేలికి ఉన్న సిరా చుక్క కారణంగా ఓటు వేయడానికి అభ్యంతరం తెలిపారు. 

5 /7

ఈ క్రమంలో సదరు మహిళ ఎన్నికల ప్రచారంలో వచ్చిన నాయకులకు తన బాధను చెప్పుకుంది. ఎన్నికల కమీషన్ అధికారులకు కూడా తన సమస్యను చెప్పుకుంది.సదరు మహిళ పలుమార్లు చర్మసంబంధ నిపుణుల దగ్గరకు తీసుకెళ్లి తన సమస్యను తీసుకెళ్లింది.

6 /7

ఎన్నికల సిరా మరక గోర్లు మధ్యలో వెళ్లడం వల్ల ఇలాంటి సమస్యలు ఏర్పడవచ్చని వెల్లడించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం కూడా సదరు మహిళ ఎన్నికలలో.. తన ఓటు హక్కు గురించి ఆందోళన చెందుతుంది.

7 /7

సబ్బుతో, అనేక రకాల ద్రావణాలతో, లిక్విడ్స్ లతో ప్రయత్నించిన కూడా మహిళ సిరాచుక్క పోలేదంటూ ఆమె తన గోడును మీడియా ఎదుట చెప్పుకుంది. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల వేళ ఈ ఘటన వార్తలలో నిలిచింది.