Raveena Tandon casting couch: సినిమా ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ గురించి బాలీవుడ్ నటి.. రవీనా టాండన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె కూడా కాస్టింగ్ కౌచ్. ఎదుర్కొన్నాను అని చెప్పి షాక్ ఇచ్చారు. ఇండస్ట్రీ లో పెద్ద పెద్ద హీరోయిన్లు కూడా ఇలాంటి.. చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నారు అని అన్నారు రవీనా. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో..వైరల్ గా మారింది.
భాషతో సంబంధం లేకుండా సినీ ఇండస్ట్రీలో.. కాస్టింగ్ కౌచ్ అనేది ఒక పెనుభూతంలా.. మారినా సంగతి తెలిసిందే. చిన్న హీరోయిన్ నుంచి పెద్ద హీరోయిన్ దాకా.. చాలామంది దీనిని.. ఎదుర్కొన్న వాళ్లే. ఈ మధ్యనే పద్మశ్రీ పురస్కారాన్ని.. అందుకున్న రవీనా టాండన్ కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు.. ఒక ఇంటర్వ్యూలో తెలియజేసి అందరికీ షాక్ ఇచ్చారు.
కాస్టింగ్ కౌచ్ గురించి మాత్రమే కాక.. నెపోటిజం గురించి కూడా మాట్లాడారు రవీనా. బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్ళకి.. నెపోటిజం ద్వారా ఇండస్ట్రీలోకి..వచ్చిన వారికి అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయి అని.. టాలెంట్ ఉన్న నటులకు అవకాశాలు అసలు లభించడం లేదు.m అని అన్నారు రవీనా టాండన్.
ఇక కాస్టింగ్ కౌచ్ విషయంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవం.. గురించి మాట్లాడుతూ.. ఇలాంటివి ఎన్నో చూశాను అని అన్నారు. ‘నా కెరియర్.. నాశనం చేయాలని చాలామంది కుట్రపన్నారు. దానికి ముఖ్య కారణం నేను ఎవరి బెడ్ రూమ్ లోకి..వెళ్ళలేదు"అని షాకింగ్ కామెంట్స్ చేశారు.
రవీనా టాండన్ ఇటీవల కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడుతూ, "నా కెరీర్‌ను నాశనం చేయాలని చాలా మంది కుట్రలు పన్నారు. నేను బెడ్రూంకు వెళ్లలేదనే విషయం పెద్ద కారణం. హీరోయిన్ల కెరీర్లను కేవలం బెడ్‌కు ఆనందం కోసం నాశనం చేసే బ్యాచ్ బాలీవుడ్లో ఇంకా ఉంది" అని పేర్కొంది. ఈ నటి చిత్ర పరిశ్రమ యొక్క చీకటి నిజాన్ని బయటపెట్టింది. "కేవలం పడక సుఖం కోసం హీరోయిన్ల కెరియర్లను నాశనం చేసే బ్యాచ్ బాలీవుడ్ లో ఇంకా ఉంది" అని ఆమె అన్నారు. బాలీవుడ్ లో మాత్రమే కాక రవీనా తెలుగులో కూడా పలు సినిమాలలో నటించారు. బాలకృష్ణ సరసన బంగారు బుల్లోడు సినిమాలో ..కూడా కనిపించారు.
ప్రముఖ నిర్మాత రవి టాండన్ కూతురు అయినా రవీనా సల్మాన్ ఖాన్ సరసన పత్తర్ కే ఫూల్ అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తరువాత మోహ్రా, అందాజ్ అప్నా అప్నా, దిల్ వాలే ఇలా ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలలో నటించారు. కేజీఎఫ్ సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు.