KGF Srinidhi Shetty: ప్రశాంత్ నీల్ వల్ల నా జీవితమే మారిపోయింది... కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి కామెంట్స్..

శ్రీనిధి శెట్టి లక్కీ గర్ల్ అని చెప్పాలి. తొలి సినిమా 'కేజీఎఫ్'తోనే బిగ్ బ్రేక్ అందుకుంది ఈ బ్యూటీ. కేజీఎఫ్ 2 లోనూ తన నటనతో మెప్పించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ 2 రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. సినిమా విడుదలై రెండు వారాలు గడిచినా... కొత్త సినిమాలు వస్తున్నా.. కేజీఎఫ్ కలెక్షన్లు ఎక్కడా డ్రాప్ అవట్లేదు. తాజాగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి కేజీఎఫ్ 2 షూటింగ్ సమయంలో తీసిన కొన్ని చిత్రాలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అందులో డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
  • Apr 29, 2022, 15:55 PM IST

KGF Srinidhi Shetty : శ్రీనిధి శెట్టి లక్కీ గర్ల్ అని చెప్పాలి. తొలి సినిమా 'కేజీఎఫ్'తోనే బిగ్ బ్రేక్ అందుకుంది ఈ బ్యూటీ. కేజీఎఫ్ 2 లోనూ తన నటనతో మెప్పించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ 2 రికార్డుల మోత మోగిస్తూనే ఉంది. సినిమా విడుదలై రెండు వారాలు గడిచినా... కొత్త సినిమాలు వస్తున్నా.. కేజీఎఫ్ కలెక్షన్లు ఎక్కడా డ్రాప్ అవట్లేదు. తాజాగా హీరోయిన్ శ్రీనిధి శెట్టి కేజీఎఫ్ 2 షూటింగ్ సమయంలో తీసిన కొన్ని చిత్రాలను తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అందులో డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.
 

1 /5

'మీ సొంత నిర్ణయాలు మీ జీవితాన్ని మార్చేందుకు.. అవి మీ కలలను సాకారం చేసుకునేందుకు దోహదపడవచ్చు. అయితే, చాలా అరుదుగా... కొన్నిసార్లు ఇతరుల నిర్ణయాలు కూడా జీవితాన్ని మార్చేస్తాయి. నా విషయంలో ప్రశాంత్ నీల్ వల్ల నా జీవితం మారిపోయింది.' అని శ్రీనిధి శెట్టి తన ఇన్‌స్టా పోస్టులో పేర్కొంది.  

2 /5

ప్రశాంత్ నీల్ 'కేజీఎఫ్' సినిమాకు తనను హీరోయిన్‌గా ఎంచుకోవడంతో తన జీవితమే మారిపోయిందని శ్రీనిధి శెట్టి పేర్కొంది. అందుకు ప్రశాంత్ నీల్‌కు థ్యాంక్స్ చెప్పింది. 

3 /5

శ్రీనిధి శెట్టి ఫోటోలపై పలువురు నెటిజన్లు... 'యూ ఆర్ మై న్యూ క్రష్..' అంటూ కామెంట్స్ చేశారు.   

4 /5

ఇంజనీరింగ్ చదివిన శ్రీనిధి... ఆ తర్వాత మోడలింగ్‌ రంగంలో అడుగుపెట్టింది. మిస్ సుప్రానేషనల్ ఇండియా 2016 టైటిల్‌ను శ్రీనిధి శెట్టి గెలుచుకుంది. 

5 /5

2018లో విడుదలైన కేజీఎఫ్ 1తో శ్రీనిధి శెట్టి సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇటీవల విడుదలైన కేజీఎఫ్ 2 కూడా బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో శ్రీనిధి పేరు మారుమోగిపోతోంది.