Khairtabad Ganesh: 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్‌ గణేషుడి విగ్రహం చూశారా? శ్రీ సప్తముఖ మహాశక్తి వినయాకుడితోపాటు అయోధ్య రామయ్య..

Khairtabad Ganesh in 70 Feets: వినాయకచవితి వచ్చిందంటే చాలు.. పదిరోజుల పండుగ అంగరంగ వైభవంగా అందరూ ఒక చోట చేరి కలిసి మెలసి జరుపుకుంటారు. అయితే, వినాయక చవితి అంటేనే హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ గణేషుడు ప్రత్యేకం. ఎందుకంటే ఇక్కడ ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేస్తారు.
 

1 /5

అయితే, ఈసారి ఖైరతాబాద్‌ గణేషుడు మరింత ప్రత్యేకం. శ్రీ సప్తముఖ మహాశక్తి వినాయకుడి రూపంలో దర్శనం ఇవ్వనున్నాడు. ఈ ఏడాది వినాయక చవితి సెప్టెంబర్‌ 7న రానుంది. అయితే, ఖైరతాబాద్‌లో ఇలా విగ్రహ ప్రతిష్ఠాపన మొదలు పెట్టి 70 ఏళ్లు అవుతుందట. ఈ సందరర్భంగా ప్రతిష్టాత్మక ఖైరతాబాద్‌ వినాయకుడిని కూడా 70 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయనున్నారు.  

2 /5

గత ఏడాది ఖైరతాబాద్‌ గణేషుడి ఎత్తు 63 అడుగులు, విగ్రహ బరువు దాదాపు 50 టన్నులు 1954 నుంచి వినాయక చవితి వేడుకలు ప్రారంభం దృష్ట్యా ఏర్పాటు చేశారు.  

3 /5

ఖైరతాబాద్‌ వినాయకుడి నిర్మాణంలో దేశ నలుమూలల నుంచి వచ్చిన కళాకారులు ఉన్నారు. ముఖ్యంగా తమిళనాడు, ముంబై, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విగ్రహాలను రూపొందించేవారు పాలుపంచుకుంటున్నారు.  

4 /5

ఇప్పటికే విగ్రహం 40 శాతం పనులు పూర్తయ్యాయి. ఈ సారి ఖైరతాబాద్‌ గణేషుడి విగ్రహానికి దాదాపు 90 లక్షల వరకు ఖర్చు అవుతుందని అక్కడి వారు చెబుతున్నారు.  ఏడు ముఖాలు, ఏడు పాములు, 14 చేతులతో సప్తముఖ మహాశక్తి గణపతి తోపాటు ఈ ఏడాది అయోధ్య బాలరాముడిని కూడా ప్రతిష్ఠించిన సంగతి తెలిసిందే దీని గుర్తుగా శ్రీరాముడి విగ్రహం కూడా ఏర్పాటు చేయనున్నారు.  

5 /5

విగ్రహం ఇతర ఏర్పాట్లను ఖైరతాబాద్‌ గణేష్‌ ఉత్సవ్‌ కమిటీ చైర్మన్‌ సింగారి రాజ్‌ కుమార్‌ ఆధ్వర్యంలో జరుగుతోంది. మొదటిరోజు తొలిపూజ తెలంగాణ గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ, సీఎం రేవంత్‌ రెడ్డి చీఫ్ గెస్టులుగా రానున్నట్లు తెలుస్తోంది.