Kiwi Benefits: ఈ ఫ్రూట్‌ తింటే వచ్చే లాభాలు తెలిస్తే.. మీరు ప్రతిరోజూ తినకుండా ఉండలేరు..

Kiwi Health Benefits: కీవీ పండు అన్ని సీజన్లలో మార్కెట్లలో అందుబాటులో ఉంటుంది. దీంతో ఇమ్యూనిటీ పెరుగతుతుంది. అయితే, కీవీ పండును ప్రతిరోజూ మీ డైట్లో చేర్చుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
 

1 /6

కీవీపండులో ఫైబర్‌ పుష్కలంగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో విటమిన్‌ ఏ, బీ6, బీ12, ఇ, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌ ఉంటుంది. ముఖ్యంగా ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. పోషకాలకు పవర్‌హౌజ్‌ కీవీ దీంతో కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..  

2 /6

కీవీలో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ బాడీలను ఉత్పత్తికి సహకరిస్తుంది. ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. కీవీ మూడ్‌ మెరుగుపరిచే సెరోటోనిన్‌  ఉత్పత్తిని మెరుగు చేస్తుంది.  

3 /6

కీవీపండు సులభంగా జీర్ణం అవుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కీవీ పండు ఎలక్ట్రోలైట్‌ సమతుల్యం చేసే పొటషియం ఉంటాయి. డెంగీ రోగులు కీవీలు తప్పకుండా తమ డైట్లో చేర్చుకోవాలి.  

4 /6

అంతేకాదు కీవీలో బయోయాక్టీవ్‌ ఆక్సిడెంట్‌ గుణాలు ఉంటాయి. ముఖ్యంగా ఇది ఫ్రీ రాడికల్‌ నుంచి కాపాడుతుంది.అందుకే కీవీ పండును డైట్లో చేర్చుకుంటే మన శరీర ఆరోగ్యానికి తోడ్పడతాయి.  

5 /6

కీవీలో విటమిన్‌ సీ, పాలీఫెనల్స్‌, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తనాళాలను కపాడాతుంది. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రక్తంలో కొవ్వులు పేరుకుపోకుండా కార్డియోవాస్క్యూలర్‌ ఆరోగ్యానికి సహాయపడుతుంది.  

6 /6

ప్రతిరోజూ మీ డైట్లో కీవీ పండును చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ముఖ్యంగా వీటిని సలాడ్‌, పిజ్జా, యోగార్ట్‌, స్మూథీస్‌లో వేసుకుని తీసుకోవచ్చు. కీవీ పండుు మన డైట్లో చేర్చుకోవడం వల్ల ఆరగ్యం బాగుంటుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)